Tenses - Introduction
తెలుగులో లాగే ఇంగ్లీషులో కూడా మూడు కాలాలు ఉన్నాయి. Present tense, past tense and future tense. అయితే ప్రతి కాలంలో మళ్ళీ నాలుగు కాలాలు ఉన్నాయి. అవి –
1.
Simple present tense
2.
Present continuous tense
3.
Present perfect tense
4.
Present perfect continuous tense
5.
Simple past tense
6.
Past continuous tense
7.
Past perfect tense
8.
Past perfect continuous tense
9.
Simple future tense
10.
Future continuous tense
11.
Future perfect tense
12.
Future perfect continuous tense
సాధారణంగా మనం కొన్ని కాలాలను తెలుగులో చెప్పగలం, కానీ ఇంకొన్నింటిని చెప్పలేము. వీటిలో మనం
కొన్నింటిని తెలుగులో ప్రత్యేకంగా చెప్పటం కష్టం.
ఉదాహరణకు ‘నేను పుస్తకం చదువుతూ ఉన్నాను’. దీనిని present continuous
tense అని చెప్పవచ్చు. అయితే
ఇంగ్లీషులో చెప్పినట్లు దీనిని present perfect continuous లో
చెప్పలేము. ఎందుకంటే దీనికి
ప్రత్యేకమైన క్రియలు లేవు.
ఇంగ్లీషులో అయితే ఒక verb లేదా
be form ను బట్టి ఇది ఫలానా కాలానికి చెందినదని చెప్పగలం, అంటే have
been లేదా has been plus verbకు ing
form చేరిస్తే అది present perfect continuous అని చెప్పవచ్చు కానీ అలా తెలుగులో చెప్పలేము. దీనికే కాదు అన్ని కాలాలకూ చెప్పటం అనేది తెలుగులో కష్టం.
దీనినే తీసుకుంటే present perfect
continuous అంటే past లో ఎప్పుడో ఆ చర్య
మొదలయ్యి ఉండి,
వర్తమానంలో కొనసాగుతూ, భవిష్యత్తులో
కూడా కొంత కాలం కొనసాగుతుందని అర్థం. అయితే దీనిని ‘నేను పుస్తకం చదువుతూ ఉన్నాను’ అని తప్ప వేరే రకంగా present perfect
continuous tense లో చెప్పటానికి తెలుగులో
వీలులేదు. అంటే చదువుతూ అనేది continuous
tense గా తీసుకుంటాము కానీ ఇంగ్లీషులో లాగా ఎప్పుడు మొదలైంది, ఎంత కాలం continue అవుతుంది అనేది చెప్పటం కష్టం.
ఇప్పుడు మనం ప్రతి కాలం గురించి వివరంగా తెలుసుకుందాం.
Simple tense అంటే సామాన్యంగా అది ఏ కాలానికి చెందినదో దాని క్రియలను బట్టి తెలుసుకోవచ్చు.
Continuous tense అంటే ఆ చర్య అంటే work
and action కొంతసేపు కొనసాగుతూ ఉన్నదని అర్థం. ఇది కాలాన్ని బట్టి అంటే present continuous tense అయితే మాట్లాడుతున్న లేక చెప్తున్న సమయంలో కొంతసేపు కొనసాగుతూ ఉన్నదని, past continuous tense అయితే గతంలో కొంతకాలం జరుగుతూ ఉండేదని అదే future continuous tense అయితే భవిష్యత్తులో కొంతకాలం జరగబోతూ ఉన్నదని అర్థం.
Perfect tense ఖచ్చితంగా ఆ చర్య జరిగినదని చెపుతుంది. ఇది కూడా కాలాన్ని బట్టి ఉంటుంది.
Perfect continuous tense కూడా work and action కొంతకాలం
ఖచ్చితంగా కొనసాగిందని తెలియచేస్తుంది. ఇది ఏ కాలంలో ఉంటే ఆ కాలాన్ని బట్టి నియమాలు (rules) మారతాయి.
ఇంగ్లీషులో 12 కాలాలు
ఉన్నప్పటికీ వాటికి వాడిన verbs ను బట్టి be forms ను బట్టి అది ఏ
కాలానికి చెందినదనే విషయం మనం సులువుగా చెప్పవచ్చు. ప్రతి కాలాన్ని కనుక్కోవడానికి కొన్ని rules ఉన్నాయి.
ఇంగ్లీషులో మూడు రకాల verb forms ఉన్నాయి. అవి present tense verb form, past tense
verb form, past participle form. మామూలుగా present tense అయితే present
tense verb ను వాడతాము. Past
tense అయితే past tense verb ను వాడతాము. అయితే past participle ను మనము perfect tense లో వాడటం జరుగుతుంది.
అలాగే ing form ఎప్పుడూ present tense verb కు మాత్రమే చేరుతుంది, కానీ past tense verb కు కాదు (అది past tense లో ఉన్నా కూడా). ఈ rules అన్నీ కూడా అన్ని కాలాలకు common గా ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తు పెట్టుకుంటే మనం ఏ కాలంలో వాక్యం ఉన్నప్పటికీ సులువుగా అర్థం చేసుకోవచ్చు.
తర్వాతి పాఠంలో మీరు ప్రతి కాలం గురించి వివరంగా తెలుసుకోవచ్చు.
Comments
Post a Comment