Interjections | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
Interjection ను మనసులోని భావాలను తెలియచేసే భాషాభాగం అనుకోవచ్చు . ఇది సంతోషాన్ని , బాధను , ఆశ్చర్యాన్ని ఇంకా ఇలాంటి అనుభూతులను తెలియచేస్తుంది . అంటే interjection ను మనసులోని అనుభూతులను తెలియచేయటానికి తెలియచేసే పదం అనుకోవచ్చు . ఆనందం , కోపం , బాధ , విచారం , ఆశ్చర్యం వంటి భావాలను ఈ పదాలను ఉపయోగించి తెలియచేయవచ్చు . వాక్యంలో ఈ పదాలు ఉన్నాయంటే మనసులోని ఏదో ఒక భావం అక్కడ ఉన్నట్లే . ఒకరకంగా దీనిని భావోద్వేగాలను తెలియచేయటానికి ఉపయోగించే పదం అనుకోవచ్చు . మిగిలిన parts of speech లాగే వీటిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి . Interjection for joy, interjection for surprise, interjection for greeting, interjection for approval, interjection for sorrow and interjection for attention. Interjection for Joy: ఏదైనా ఆనందం , సంతోషం కలిగినప్పుడు interjection for joy ను వాడతారు . హఠాత్తుగా సంతోషం కలిగినా కూడా వీటిని వాడి తెలియచేస్తారు . ‘Wow’ ను సాధారణంగా ఏదైనా ఆశ్చర్యం కలిగే విషయాలకు వాడుతున్నప్పటికీ , అనుకోకుండా ఆనందం కలిగించిన విషయాలకు కూడా వాడటం జరుగుతుంది . Ex: hu...