Conjunctions | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
Conjunction అంటే తెలుగులో సముచ్చయం అంటారు. ఇవి పదాలను, పదబంధాలను, వాక్యాలను, క్లాజులను కలపటానికి ఉపయోగపడతాయి.
ఉదాహరణ: Ramu and Raju went to school.
ఇక్కడ ‘and’ అనేది రాము, రాజు అనే పదాలను కలుపుతోంది.
కనుక ఇది conjunction.
Conjunctions ముఖ్యంగా మూడు రకాలు – coordinating conjunctions,
subordinating conjunctions and correlative conjunctions.
Coordinating conjunctions: Coordinating conjunctions అనేవి చాలా సాధారణంగా వాడే conjunctions. Coordinating conjunctions ఒకే విధమైన లేదా సమానమైన పదాలను, పదబంధాలను, క్లాజులను కలుపుతాయి. ఇంకా రెండు పదాలు, రెండు పదబంధాలు, రెండు క్లాజులను కలపటానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఇది వేటిని కలుపుతుందో ఆ పదాలకు లేక వాక్యాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్లాజులు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవైనా కావచ్చు లేక సంబంధం లేనివైనా కావచ్చు. ఈ conjunctions సాధారణంగా రెండు పదాలు లేదా వాక్యాల మధ్య ఉంటాయి, తద్వారా వాటిని కలుపుతాయి కానీ వాక్యం మొదట కానీ, చివర కానీ ఉండవు. ముఖ్యంగా ఏడు రకాల coordinating conjunctions ఇంగ్లీషులో ఉన్నాయి. ఇవి for, and, nor, but, or, yet and so. Coordinating conjunctionsకు సంబంధించి ముఖ్యంగా గమనించవలసిన విషయమేమిటంటే ఇవి రెండు పదాలను లేక పదబంధాలను కలుపుతున్నప్పుడు వాటి మధ్య ఎటువంటి కామాను వాడటం జరగదు కానీ రెండు కంటే ఎక్కువవాటిని కలిపేటప్పుడు వాటి మధ్య కామాను వాడతారు అంతే కాకుండా చివరి పదం లేక పదబంధానికి ముందు ఈ conjunction ను వాడటం జరుగుతుంది.
And అంటే మరియు అని అర్థం. అంటే చెప్పేది కాకుండా ఇంకొకటి ఉన్నప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ సమాన ప్రాధాన్యం కల విషయాలకు దీనిని ఉపయోగిస్తారు. ఉదాహరణ: I read and write the lesson.
Or అంటే లేక అని అర్థం. రెండింటి మధ్య ఎంపిక చేసుకునే సందర్భంలో దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: Are you going to a movie or an exhibition?
So అంటే కనుక అని అర్థం. సాధారణంగా దీనిని ఒకదాని ఫలితం చెప్పేటప్పుడు వాడటం జరుగుతుంది. ఉదాహరణ: He is a vegetarian. So he does not eat meat.
But అంటే కాని అని అర్థం. ఏదైనా రెండు సంబంధం లేని విషయాల గురించి చెప్పేటప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: I worked very hard, but I did not get the promotion.
For అంటే మాములుగా కొరకు అని అర్థం. అయినప్పటికీ ఎందుచేతనంటే అనే అర్థంలో సముచ్చయంగా దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: She will come late to the office, for she has a doctor appointment.
Yet అంటే అయినప్పటికీ అని అర్థం. ఒకదానితో ఒకటి సంబంధం లేని, విరుద్ధమైన విషయాలు చెప్పేటప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: She is allergic to cats, yet she has two of them in her home.
Nor అంటే లేదా, లేక అని అర్థం. విరుద్ధం కాని రెండు విషయాల గురించి చెప్పేటప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. సాధారణంగా ప్రతికూల (negative) పదాలకు, వాక్యాలకు దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: She doesn’t eat chocolates, nor does she eat cake.
ఇక్కడ మీరు అన్ని ఉదాహరణ వాక్యాలను గమనిస్తే, ఎక్కడైతే conjunction ను వాడటం జరిగిందో, ఆ పదాలు లేక వాక్యాలు అన్నిటికీ సమాన ప్రాధాన్యం ఉండటం మీరు గమనించవచ్చు.
మొదటి ఉదాహరణ వాక్యం ‘and’ తో వాడినది గమనించండి. I read and write the lesson. నేను పాఠం చదువుతాను మరియు వ్రాస్తాను. అంటే ఇక్కడ చదవటానికి మరియు వ్రాయటానికి సమాన ప్రాధాన్యం ఉంది.
అలాగే రెండవ వాక్యంలో నువ్వు సినిమాకు వెళ్తావా లేక ఎగ్జిబిషన్ కా అని అడగటం జరిగింది. అంటే సినిమా లేక ఎగ్జిబిషన్ అనే రెండు సమ ప్రాధాన్యం కల విషయాల మధ్య ఎంపిక చేసుకోవటం ఇక్కడ కనిపిస్తోంది. మూడవ వాక్యంలో అతడు శాకాహారి కనుక మాంసం తినడు అని చెప్పటం జరిగింది. నాల్గవదాంట్లో నేను కష్టపడి పని చేశాను, కానీ నాకు ప్రమోషన్ రాలేదు అని చెప్పటం జరిగింది. అంటే మామూలుగా కష్టపడినప్పుడు, ప్రమోషన్ వస్తుంది, కానీ దానికి విరుద్ధంగా రాలేదు కనుక ‘but’ ని వాడటం జరిగింది.
ఐదవదాంట్లో ఆమె ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంది ఎందుచేతనంటే ఆమెకు డాక్టరు అప్పాయింట్మెంట్ ఉంది అని చెప్పటం జరిగింది. ఆరవ వాక్యంలో ఆమెకు పిల్లులంటే ఎలర్జీ ఉంది, అయినప్పటికీ ఆమె ఇంట్లో రెండు ఉన్నాయి అనీ, ఏడవదాంట్లో ఆమె చాక్లెట్ తినదు, లేక కేకూ తినదు. అంటే ఆమె చాక్లెట్ కానీ, కేకు కానీ తినదు అనీ చెప్పటం జరిగింది. ఈ వాక్యాన్ని ఆమె చాక్లెట్ మరియు కేకు తినదు అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ‘nor’ ను వాడాము కనుక negative వాక్యంగా చెప్పటం జరిగింది.
ఈ రకంగా సమాన ప్రాధాన్యం కల విషయాలకు coordinating conjunctions ను వాడటం జరుగుతుంది.
Subordinating
conjunctions: Subordinating conjunction ను అధీన సముచ్చయం లేక సహాయకర సముచ్చయం అని అనవచ్చు. ఎందుకంటే ఇవి subordinating క్లాజులను ప్రవేశపెడతాయి. ఇవి dependent క్లాజులను independent క్లాజులతో
కలుపుతాయి.
ఇంకో రకంగా చెప్పాలంటే ఇవి main క్లాజులను, subordinating క్లాజులను
కలుపుతాయి. Subordinating క్లాజులు
dependent గా ఉంటాయి. వీటిని main క్లాజులతో కలపటం ద్వారా కొంత అదనపు సమాచారం
దీనికి తోడవుతుంది. ఇక్కడ గమనించవలసిన
విషయం ఏమిటంటే కేవలం subordinating క్లాజులను వాడినంత మాత్రాన వాక్యం పూర్తవదు. Main క్లాజులు కలిస్తేనే
అర్థవంతమైన వాక్యం వస్తుంది.
Subordinating
conjunctions చాలా ఉన్నాయి. After, before, although, how, if, once, because,
since, so that, until, till, unless, while, where, whether and when అనేవి కొన్ని subordinating conjunctions.
వీటిలో ఒక్కొక్కదానిని ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం.
·
After ను తర్వాత అనే అర్థంలో వాడతారు.
ఉదాహరణ: Please call me after you reach
the destination.
·
Before ను
ముందు అనే అర్థంలో వాడతారు.
ఉదాహరణ: Please inform me before you leave
the place.
·
Although ను అయినప్పటికీ అనే అర్థంలో వాడటం
జరుగుతుంది. సాధారణంగా రెండు విరుద్ధ విషయాలు చెప్పటానికి దీనిని వాడతారు.
ఉదాహరణ: She came to office, although she
was suffering from fever.
ఇక్కడ చూస్తే, ఆమె జ్వరంతో బాధ పడుతున్నప్పటికీ,
ఆఫీసుకు వచ్చింది. మామూలుగా జ్వరంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, కానీ దానికి
విరుద్ధంగా ఆమె ఆఫీసుకు వచ్చింది.
·
How ను
ఎలా అనే అర్థంలో వాడతారు.
ఉదాహరణ: Could you please explain how you
finished the task?
·
If ను ఒకవేళ అనే అర్థంలో వాడటం
జరుగుతుంది. అంటే రెండు విషయాల గురించి చెప్పేటప్పుడు, ఒకవేళ ఇది జరిగితే, దానికి
అనుగుణంగా రెండవది కూడా జరుగుతుంది అనే చెప్పేటప్పుడు దీనిని వాడతారు. అంటే ఇది ఒక
conditional clause.
ఉదాహరణ: You will pass the exams if you
study hard.
పైన ఉన్న వాక్యంలో నువ్వు కష్టపడి చదివితే పరీక్షలో
పాసవుతావు అని చెప్పటం జరిగింది. అంటే చదవటం అనేది జరిగితేనే పాసవటం జరుగుతుంది, లేకపోతే లేదు.
·
Once కు
మామూలుగా అర్థం ఒకసారి. కానీ దీనిని ‘ఎప్పుడైతే అప్పుడు’ అనే అర్థంలో వాడతారు.
ఉదాహరణ: I am going out once the match has
finished.
ఇక్కడ మ్యాచ్ అయిపోయిన వెంటనే అంటే ఎప్పుడైతే మ్యాచ్
అయిపోతుందో అప్పుడు నేను బయటకు వెళ్తాను అని చెప్పటం జరిగింది.
·
Because ను ఎందువల్లనంటే లేక ఎందుచేతనంటే
అనే అర్థంలో వాడతారు. అంటే ఒక విషయం జరగటానికి కారణం అనేది దీనివల్ల తెలుస్తుంది.
ఉదాహరణ: I am staying at home because it is raining outside.
అంటే ఇక్కడ వర్షం పడటం అనే కారణం వలన నేను ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పటం
జరిగింది.
·
Since ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించటానికి
వాడతారు.
ఉదాహరణ: I have been playing guitar since my childhood.
పైన వాక్యంలో నా చిన్నతనం నుండి నేను గిటార్ వాయిస్తున్నాను అని చెప్పటం
జరిగింది.
ఇంకొన్ని subordinating conjunctions గురించి తర్వాత
పాఠంలో చూద్దాం.
·
So that
ను ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు జరిగిన క్రమం గురించి చెప్పటానికి ‘ఆ
క్రమంలో’ అనే అర్థంలో వాడతారు. అంటే దాని వలన అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు.
ఉదాహరణ: He
is staying at home so that he doesn’t miss the postman.
ఇక్కడ అతడు ఇంట్లో ఉంటున్నాడు దానివలన పోస్ట్ మ్యాన్ ను మిస్ అవ్వటం జరగదు అనే
అర్థంలో చెప్పబడింది. అంటే ఇంట్లో ఉండటం వలన పోస్ట్ ను తీసుకోగలుగుతాడు.
·
Until ను అప్పటివరకు అనే అర్థంలో
వాడతారు. అంటే ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు, అది జరిగేవరకు అనే సందర్భంలో
దీనిని వాడటం జరుగుతుంది.
ఉదాహరణ: Don’t
go anywhere until I come back.
ఇక్కడ నేను తిరిగి వచ్చేవరకు నువ్వు ఎక్కడకూ వెళ్ళవద్దు అని చెప్పటం జరిగింది.
అంటే తిరిగి రావటం జరిగే వరకు రెండో చర్య జరగటానికి వీల్లేదు.
·
Till ను కూడా అప్పటివరకు అనే అర్థంలో
వాడతారు. Till, until రెండింటికి అర్థం ఒకటే అయినప్పటికీ till ను informal style
లో ఎక్కువగా వాడటం జరుగుతుంది.
ఉదాహరణ: Will
you wait till I return?
ఇక్కడ నేను తిరిగి వచ్చేవరకు నువ్వు వేచి ఉంటావా అని అడగటం జరిగింది. అంటే
దీనిలో వేచి ఉండటం అనేది తిరిగి వచ్చేవరకు తప్పదు.
·
Unless ను తప్ప అనే అర్థంలో వాడతారు. అంటే
ఏదైనా ఒకదాని గురించి చెప్తూ, అది తప్ప లేక ఆ పరిస్థితిలో తప్ప అనే అర్థంలో దీనిని
వాడటం జరుగుతుంది.
ఉదాహరణ: Unless
you go out, you will not buy the vegetables.
ఇక్కడ నువ్వు బయటకు వెళ్తే తప్ప, నువ్వు కూరగాయలు కొనవు అని చెప్పటం జరిగింది.
అంటే బయటకు వెళ్ళటం అనేది తప్పనిసరి, లేకపోతే కూరగాయలు కొనలేవు.
·
While ను ఆ సమయంలో అనే అర్థంలో వాడటం
జరుగుతుంది. అంటే ఏదైనా జరుగుతున్నప్పుడు, దానిని గురించి చెప్పేటప్పుడు దీనిని
వాడతారు.
ఉదాహరణ: She
met her friend while she was working in Mumbai.
ఇక్కడ ఆమె ముంబైలో పని చేస్తున్నప్పుడు అంటే పని చేసే సమయంలో తన
స్నేహితురాలిని కలిసింది.
·
Where ను ఎక్కడైతే అనే అర్థంలో వాడతారు.
ఉదాహరణ: This
is where he came from.
పై వాక్యంలో అతడు ఇక్కడనుండే వచ్చాడు అని చెప్పటం జరిగింది అంటే ఎక్కడ నుండి
అయితే అని ఒక ప్రదేశాన్ని సూచిస్తున్నామో అక్కడనుండే అనే అర్థంలో వాడబడింది.
·
Whether ను అయితే అవ్వచ్చు లేకపోతే లేదు
అనే సందర్భంలో వాడతారు.
ఉదాహరణ: It
is time to decide whether he should take an action.
అంటే అతడు ఏదైనా తగిన చర్య తీసుకోవచ్చో, లేదో నిర్ణయించే సమయం వచ్చింది. అంటే
తీసుకోవాలో, లేదో అనేది అతడి మీద ఆధారపడి ఉంటుంది.
·
When ను ఎప్పుడైతే అనే అర్థంలో వాడటం
జరుగుతుంది.
ఉదాహరణ: She
woke up when her baby was crying.
ఇక్కడ తన శిశువు ఏడుస్తున్నప్పుడు ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పటం
జరిగింది. అంటే ఎప్పుడైతే ఆమె శిశువు ఏడ్చిందో అప్పుడు ఆమెకు మెలకువ వచ్చింది అనే
అర్థం తీసుకోవచ్చు.
Correlative conjunctions: Correlative conjunction ను సహసంబంధ సముచ్చయం అంటారు. దీనిని పరస్పరాశ్రిత సముచ్చయం అని కూడా అనవచ్చు. ఎందుకంటే correlative conjunctions జంటగా వస్తాయి. అంటే వీటిని జంటగానే ఉపయోగించాలి. ఇవి సమతుల్య పదాలు, పదబంధాలు, క్లాజులను కలుపుతాయి. అందుకని ఈ విషయంలో వీటిని coordinating conjunctions తో పోల్చవచ్చు.
Either – or, both – and, neither
– nor, rather – than, whether – or, as – as, as many – as, no sooner – than, and not only – but also అనేవి కొన్ని correlative conjunctions.
వీటిలో ఒక్కొక్కదానిని ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం.
·
Either – or ను positive sentences లో
రెండింటి మధ్య ఎంపిక చేసుకునేటప్పుడు వాడతారు. అంటే అది కానీ లేక ఇది కానీ అని
చెప్పే సందర్భంలో వాడటం జరుగుతుంది.
ఉదాహరణ: You can eat either chocolates or
biscuits.
ఇక్కడ నువ్వు చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ
తినవచ్చు అని చెప్పటం జరిగింది. అంటే ఉన్న రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు.
·
Both – and ను రెండు విషయాలు ఉండి, ఆ రెండూ
జరిగినాయని లేక అవసరం అని చెప్పే సందర్భంలో వాడతారు.
ఉదాహరణ: She is both intelligent and
beautiful.
పైన వాక్యంలో ఆమె తెలివిగలది మరియు అందగత్తె, రెండూనూ
అని చెప్పటం జరిగింది. అంటే ఆమెలో ఆ రెండు గుణాలు ఉన్నాయి.
·
Neither – nor ను negative sentences లో రెండు విషయాల గురించి
చెప్పేటప్పుడు వాడతారు. అంటే అది కాదు, ఇదీ కాదు అనే అర్థంలో దీనిని వాడటం
జరుగుతుంది.
ఉదాహరణ: He is neither rich nor famous.
ఇక్కడ అతడు ధనవంతుడూ కాదు, ప్రసిద్ధి చెందినవాడూ కాదు
అని చెప్పటం జరిగింది. అంటే చెప్పిన రెండింటిలో అతడికి ఏదీ లేదు.
·
Rather –
than ను ఏవైనా రెండు సమాంతర విషయాల మధ్య ఎంపికకు ఉపయోగిస్తారు.
ఉదాహరణ: He would rather read a book than
watch TV.
పైన వాక్యంలో అతడు టివి చూడటం కన్నా పుస్తకం
చదవటానికి ఆసక్తి చూపుతాడనే అర్థంలో వాడటం జరిగింది.
·
Whether –
or ను రెండు విషయాల మధ్య ఎంపికను సూచించటానికి వాడటం జరుగుతుంది.
ఉదాహరణ: He wasn’t sure whether to go
outside or stay at home.
పైన ఉన్న వాక్యంలో అతడికి బయటకు వెళ్ళాలా లేక ఇంట్లో
ఉండాలా అనే విషయం గురించి ఖచ్చితమైన నిర్ధారణ లేదని చెప్పటం జరిగింది.
·
As – as
ను రెండు సమానమైన లక్షణాలు ఉన్న విషయాలను పోల్చి చెప్పటానికి వాడతారు.
ఉదాహరణ: Seetha is as intelligent as
Latha.
ఇక్కడ లత ఎంత తెలివిగలదో సీత కూడా అంతే తెలివైనది అని
చెప్పటం జరిగింది. అంటే సీత, లత కూడా ఇద్దరు కూడా తెలివిలో సమానమే అనే అర్థం
వస్తుంది.
·
As many – as ను రెండు సమానమైన విషయాలకు, మొదటిదానితో సమానంగా
రెండవది ఉన్నదని చెప్పేటప్పుడు వాడతారు.
ఉదాహరణ: There
are as many chairs as there are students.
ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని కుర్చీలు ఉన్నాయి అని చెప్పటం
జరిగింది. అంటే రెండూ సమానంగా ఉన్నాయి అనే అర్థంలో వాడటం జరిగింది.
·
No sooner – than ను రెండు సంఘటనలు
వెంటవెంటనే కానీ, లేదా ఏకకాలంలో కానీ జరిగినాయని చెప్పే సందర్భంలో వాడతారు.
ఉదాహరణ: No
sooner had she read the letter than she burst into tears.
పైన వాక్యంలో ఉత్తరం చదివిన వెంటనే ఆమె ఏడవటం మొదలు పెట్టింది అని చెప్పటం
జరిగింది. అంటే రెండు సంఘటనలు వెంటవెంటనే జరిగాయి.
·
Not only – but also ను
విలక్షణమైన రెండు ఎంపికలను కలపటానికి ఉపయోగిస్తారు. అంటే ఒక విషయానికి జతగా ఇంకో
విషయం కూడా ఉన్నదని చెప్పేటప్పుడు దీనిని వాడతారు.
ఉదాహరణ: He
is not only intelligent, but also very rich.
Comments
Post a Comment