Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
Parts of speech ని తెలుగులో భాషాభాగములు అంటారు . Parts of speech అనేవి భాషకు కీలకం . భాష నేర్చుకోవడంలో ఈ Parts of Speech అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంగ్లీషులోని ప్రతీపదం ఈ Parts of Speech లోని ఏదో ఒక part కు చెందివుంటుంది. Definition: According to the nature and function, we can divide all words into 8 groups. వాటి యొక్క ఉపయోగం , విధిని బట్టి ఇవి వర్గీకరించబడ్డాయి . తెలుగులో ఇవి ఐదు ఉంటాయి . అయితే ఇంగ్లీష్ లో ఇవి ఎనిమిది ఉంటాయి . అవి noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction and interjection. వీటిలో ప్రతిదాని గురించి వివరంగా తర్వాత చూద్దాం . అయితే ఇప్పుడు మొదట parts of speech లోని ప్రతి భాగం గురించి అది అంటే ఏమిటి , ఎందుకు ఉపయోగపడుతుంది , దానికి కొన్ని ఉదాహరణలు ఈ పాఠంలో మీరు నేర్చుకోవచ్చు . మొదటగా Noun అంటే నామవాచకం . పేరును తెలియచేసే దానిని noun అంటారు . వ్యక్తుల యొక్క , వస్తువుల యొక్క , ప్రదేశాల యొక్క ఇంకా వేటి యొక్క పేరునైనా సరే తెలియచేసే పదాన్ని noun అంటారు . వీటిలో ఉన్న రకాలను గురించి ...
Comments
Post a Comment