Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
Parts of speech ని తెలుగులో భాషాభాగములు అంటారు. Parts of speech అనేవి భాషకు కీలకం. భాష నేర్చుకోవడంలో ఈ Parts of Speech అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంగ్లీషులోని ప్రతీపదం ఈ Parts of Speechలోని ఏదో ఒక partకు చెందివుంటుంది.
Definition: According to
the nature and function, we can divide all words into 8 groups.
వాటి యొక్క
ఉపయోగం, విధిని బట్టి
ఇవి వర్గీకరించబడ్డాయి. తెలుగులో ఇవి
ఐదు ఉంటాయి. అయితే ఇంగ్లీష్
లో ఇవి ఎనిమిది ఉంటాయి. అవి noun, pronoun, adjective,
verb, adverb, preposition, conjunction and interjection.
వీటిలో ప్రతిదాని గురించి వివరంగా తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు మొదట parts
of speech లోని
ప్రతి భాగం గురించి అది అంటే ఏమిటి,
ఎందుకు ఉపయోగపడుతుంది, దానికి కొన్ని
ఉదాహరణలు ఈ పాఠంలో మీరు నేర్చుకోవచ్చు.
మొదటగా Noun
అంటే నామవాచకం. పేరును
తెలియచేసే దానిని noun
అంటారు. వ్యక్తుల యొక్క, వస్తువుల యొక్క,
ప్రదేశాల యొక్క ఇంకా వేటి యొక్క పేరునైనా సరే తెలియచేసే పదాన్ని noun
అంటారు. వీటిలో ఉన్న రకాలను
గురించి మీరు తర్వాత
పాఠంలో నేర్చుకుంటారు.
ఉదా:
Ramu, Sita, Hyderabad, lion, etc.
Pronoun అంటే సర్వనామం.
Noun కు బదులుగా pronoun ను వాడతారు. Pronounలోనే మనకు persons కూడా వస్తాయి. Persons అంటే తెలుగులో
పురుషలు అంటారు. అలాగే ఇంగ్లీష్
లో కూడా three persons ఉన్నాయి. వాటి గురించి
కూడా తర్వాత పాఠాలలో మీరు వివరంగా నేర్చుకోవచ్చు.
ఉదా:
I, you, he, she, it, etc.
Adjective అంటే విశేషణం.
ఇది noun యొక్క,
pronoun యొక్క గుణాలను (qualities) తెలియచేస్తుంది. దీనిని వాడటం
వలన వాటి యొక్క అర్థం కూడా మారుతుంది.
ఉదా:
Good, bad, sweet, sour, etc.
Verb అంటే క్రియ.
ఏదైనా పనిని తెలియచేసే దానిని verb అంటారు. అంటే ఏ పనినైనా
తెలియచేసే పదాన్ని verb అంటారు. Verb కాలాన్ని బట్టి
మారుతుంది. అంటే past, present and future వంటి వివిధ
కాలాల్లో వివిధ రకాలుగా verb యొక్క రూపం
ఉంటుంది. వీటి గురించిన
వివరాలు మీరు తర్వాత
పాఠాలలో చూడవచ్చు.
ఉదా:
Run, walk, see, laugh, etc.
Adverb అంటే క్రియా విశేషణం.
ఇది క్రియ యొక్క, విశేషణం యొక్క లేదా ఇంకొక క్రియా విశేషణం యొక్క గుణాలను (qualities) తెలియచేస్తుంది,
వాటి
అర్థాన్ని మారుస్తుంది. అంటే వీటిలో ఏదో
ఒకదాని యొక్క అర్థం మార్చటానికి లేదా వాటి గుణాన్ని లేక స్వభావాన్ని
తెలియచేయటానికి ఉపయోగించే పదబంధాన్నే adverb అంటారు.
ఉదా:
Quickly, always, sometimes, here, etc.
Preposition ఒక వాక్యంలో noun తోటి లేదా pronoun తోటి ఇంకొక
పదానికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ఇది వాటి యొక్క స్థితిని అంటే అవి ఎక్కడ లేదా ఎలా
ఉన్నాయో తెలియచేస్తుంది. Preposition అనేది సమయాన్ని
లేక కాలాన్ని, స్థలాన్ని, సంబంధాన్ని
సూచిస్తుంది. Prepositions ని తెలుగులో
విభక్తి ప్రత్యయాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి కూడా
వేర్వేరు పదాలకు మధ్య సంబంధాన్ని కలిగిస్తాయి, తెలియచేస్తాయి లేదా వాటి అన్వయానికి కారణమవుతాయి.
ఉదా:
On, in, from, with, etc.
Conjunction ఒక వాక్యంలోని రెండు పదాలను, పదబంధాలను లేక
క్లాజులను కలిపి ఉంచటానికి ఉపయోగపడుతుంది. తద్వారా అవి ఎలా లేక ఏ రకంగా కలిసి ఉన్నాయో తెలియచేస్తుంది. Conjunction అనేది రెండు
వాక్యాలను కలపటానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని తెలుగులో సముచ్చయం అంటారు.
ఉదా:
On, in, from, with, etc.
Interjection అనేది
భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి ఉపయోగపడుతుంది. దీనిని కోపం, బాధ, ఆశ్చర్యం, సంతోషం వంటి వాటిని
వ్యక్తం చేయటానికి వాడతారు. మామూలుగా
వ్యక్తీకరించే ఈ పదాలకు ఎలాంటి అర్థం లేకపోయినా ఆ వ్యక్తీకరించిన పదాన్ని బట్టి, ఆ విధానాన్ని
బట్టి అది ఏ భావానికి సంబంధించినదో తెలుస్తుంది. అంటే కొన్ని పదాలు కోపాన్ని, కొన్ని సంతోషాన్ని, కొన్ని బాధను, కొన్ని ఆశ్చర్యాన్ని, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కదానిని తెలియచేస్తుంది.
ఉదా:
Wow, alas, hurrah, ah, etc.
Published by: Praveen Ragi, PR Learning Lab, WhatsApp: 0091 8978500864, Email: praveen2006@gmail.com,
Follow us on our WhatsApp group: https://chat.whatsapp.com/DqrACbkKCJ3EfPmteeOPnB
Comments
Post a Comment