Prepositions (విభక్తి ప్రత్యయాలు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
Prepositionsను తెలుగులో విభక్తి ప్రత్యయాలు అని అనుకోవచ్చు. Preposition సాధారణంగా noun లేక pronounకు వాక్యంలోని ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ముఖ్యంగా ఆరు రకాల prepositions ఉన్నాయి. ఇవి - Preposition for Time, Preposition for Place, Preposition for Direction, Preposition for Agent, Preposition for Instrument and Prepositional Phrase.
Preposition for Time: Prepositions for Time ను వివిధ సమయాలను సూచించటానికి వాడతారు.
Ex:
in, on, at etc.
వీటిలో ‘in’ ను నెల లేక సంవత్సరం గురించి తెలియచేయటానికి, ఒక రోజు, నెల, సీజన్ లేదా సంవత్సరంలోని నిర్దిష్ట సమయాన్ని సూచించటానికి, ఒక శతాబ్దాన్ని సూచించటానికి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లోని నిర్దిష్ట సమయాన్ని సూచించటానికి వాడతారు.
Ex: in March, in 2017, in winter, in
the past etc.
‘On’ ను ఒక తేదీ, వారం లేదా నిర్దిష్టమైన రోజును సూచించటానికి వాడతారు.
Ex: on Monday, on April 1, on
Republic Day etc.
‘At’ ను గడియారంలోని సమయాన్ని తెలియచేయటానికి, ఖచ్చితమైన సమయాన్ని సూచించటానికి వాడతారు.
Ex: at 9:00 p.m., at sunrise, at
bedtime etc.
Example
sentences:
He went to the USA in 2016.
I will meet you on Monday.
He called me at 8:00 a.m.
Preposition for Place: Prepositions for Place ను వేర్వేరు స్థలాలు లేక ప్రదేశాలను సూచించటానికి వాడతారు.
Ex: in, on, at etc.
వీటిలో ‘in’ ను ఏదైనా హద్దులు లేక పరిమితులు ఉన్న ప్రదేశాలను సూచించటానికి వాడతారు. దేని మీద అయినా ఉంచిన లేక పెట్టిన వస్తువును గురించి తెలియచేయడానికి ‘on’ ను, ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద ఉంచిన దానిని తెలియచేయడానికి ‘at’ ను వాడతారు.
Ex: in a box, on the table, at the
bus stop etc.
Example
sentences:
He lives in London.
The book is on the table.
He met her at the bus stop.
Preposition
for Direction: Prepositions for
Direction ను ఏదైనా దిశ లేక దిక్కును సూచించటానికి వాడతారు.
Ex: into, to, towards, downwards,
through etc.
Example
sentences:
Ram went to the school.
Someone is coming towards me.
The Krishna River flows through
Vijayawada.
Preposition
for Agent: Prepositions for Agent ను కర్త (subject) కు, అతడు లేక ఆమె చేసే చర్య (action) కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయటానికి ఉపయోగిస్తారు.
Ex: by, with etc.
Example
sentences:
Ravana was killed by Rama.
The bottle is filled with
water.
Preposition
for Instrument: Prepositions for
Instrument పరికరాలు, యంత్రాల వంటి nouns ను వాక్యంలోని ఇతర పదాలను కలపటానికి సహాయం చేస్తాయి.
Ex: by, with, with the help of etc.
Example
sentences:
He goes to college by bus.
Ram opened the lock with key.
Grandfather watered the plants with
the help of a tube.
Prepositional
Phrase: Prepositional Phrases అంటే verb మరియు preposition కలిసి ఉంటాయి. వీటినే prepositional verbs అని కూడా అంటారు. కొన్ని verb లకు వాటి తర్వాత preposition ఖచ్చితంగా ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే verb తర్వాత preposition వచ్చేవాటిని prepositional verbs అంటారు.
Ex: look at, knock at, wait for,
believe in, worry about, remind of etc.
Example
sentences:
She believes in God.
Look at the picture.
She is knocking at the door.
Comments
Post a Comment