Simple present tense
Simple present tense అనేది చాలా సాధారణంగా వాడే ఒక tense. దీని rules తెలిస్తే ఈ tense ను వాడటం చాలా తేలిక.
ముందుగా simple present
tense ను ఎప్పుడు వాడతారో తెలుసుకోండి.
1. Regular actions లేదా repeated
actions కు simple
present tense ను వాడతారు.
క్రింది ఉదాహరణలు చూడండి.
·
I go to school.
·
He drinks milk.
ఇక్కడ చెప్పిన రెండు ఉదాహరణలు గమనిస్తే, మొదటి ఉదాహరణలో స్కూలుకు వెళ్ళటం అనేది రోజూ జరిగే చర్య. అంటే అది తిరిగి రెండో రోజూ, మూడో రోజూ ఇలా ప్రతి రోజూ జరుగుతుంది. అలాగే అతడు పాలు తాగుతాడు అంటే అది కూడా రోజువారీ జరిగే చర్య. అంటే simple present tense ను రోజువారీ చర్యలకు లేదా దినచర్యలకు వాడతారు.
2. Present tense sentences లో present tense verb వాడతారని మీకు తెలుసు కదా! అయితే simple present tense లో ఉన్న ఒక ముఖ్యమైన rule ఏమిటంటే subject third person singular లో ఉన్నప్పుడు verb కు ‘s’ కానీ, ‘es’ కానీ, ‘ies’ కానీ వచ్చి చేరుతుంది. ఈ rule కేవలం third person singular కు మాత్రమే అంటే he, she, it కు మాత్రమే. మిగిలిన అన్ని persons లో verb ను మామూలుగా ఉన్నది ఉన్నట్లుగానే వాడటం జరుగుతుంది. అంటే subject third person singular లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ person అంటే first person singular and plural,
second person singular and plural and third plural లో ఉన్నప్పటికీ present tense verb ను మామూలుగానే వాడటం జరుగుతుంది.
Subject third person అయినప్పుడు మామూలుగా అన్ని verbsకు ‘s’ చేరుతుంది కానీ దానిలోని చివరి అక్షరం o, ch, sh, ss, es, x, z తో అంతమైతే verb కు ‘es’ చేరుతుంది
ఉదాహరణలు:
·
Drink – drinks
·
Do – does
·
Fix – fixes
·
Wash – washes – ఇలా ఉంటుంది.
ఉదాహరణ వాక్యాలు:
·
I do this work.
·
She does this work.
అయితే verb చివరి letter consonant అయి ఉండి, దాని తర్వాత ‘y’ వస్తే verb కు ‘ies’ చేర్చాలి.
ఉదాహరణలు :
·
Marry – marries
·
Carry – carries
ఇలా వస్తాయి. కనుక verb లో చివరి అక్షరం ఏమి ఉంది అనేది చూసుకోవాలి. ఇది కేవలం subject third person singular అయితేనే. మిగిలిన persons కు కేవలం present tense verb చేరిస్తే సరిపోతుంది, కానీ మిగిలిన rules చూసుకోవాలి.
కనుక simple present tense లో verb ను వాడటం సులువే అయినప్పటికీ, subject చూసుకోవాలి. ముఖ్యంగా subject లో third person singular ఉంటే పైన చెప్పిన rule apply చేయాలి.
3. Simple present tense ను general truths కు, facts కు వాడతారు, అంటే వాటిని చెప్పేటప్పుడు simple present tense లో చెప్తారు.
ఉదాహరణలు :
·
The sun rises in the east.
·
The Prime Minister of India lives in Delhi.
పైన చెప్పిన ఉదాహరణలను చూస్తే మొదటిది general truth, రెండవది fact. అందుకని వాటిని simple present tense లో చెప్పటం జరిగింది.
4. అలవాటుగా
అంటే habitual గా చేసే పనులను కూడా simple present tense లో చెప్పటం జరుగుతుంది.
ఉదాహరణలు :
·
Sita gets up early in the morning.
·
I drink coffee every day.
పై ఉదాహరణలలో రెండింటిలో కూడా అలవాటుగా చేసే పనులు తెలియచేయబడుతున్నాయి.
ఇవి మామూలుగా simple present tense కు సంబంధించిన rules. అయితే దీనిని ఎటువంటి వాక్యాల్లో ఎలా వాడాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని affirmative sentences లో వాడతారు.
ఇలాంటి వాక్యాల్లో verb ను మామూలుగానే వాడతారు.
ఉదాహరణలు:
He speaks French. - అతడు ఫ్రెంచ్
మాట్లాడతాడు.
She likes Hindustani music. - ఆమెకు హిందూస్తానీ
సంగీతం అంటే ఇష్టం.
దీనిని negative sentences లో వాడాలనుకున్నప్పుడు do not లేక does not చేర్చి వాడతారు.
ఉదాహరణకు పైన ఇచ్చిన రెండు వాక్యాలను negative గా చెప్పాలంటే ఇలా చెప్పాలి.
He does not speak French. - అతడు ఫ్రెంచ్
మాట్లాడడు.
She does not like Hindustani music. - ఆమెకు హిందూస్తానీ
సంగీతం అంటే ఇష్టం లేదు.
పైన ఇచ్చిన వాక్యాల్లో verb కు ముందు does not ను చేర్చటం మీరు గమనించవచ్చు. అలా చేర్చటం వలన ఇవి negative గా మారాయి. అయితే పైన ఇచ్చిన రెండు వాక్యాల్లోనూ subject third person singular కనుక does not ను వాడటం జరిగింది. Does వాడుతున్నాము కనుక ఇక verb కు ‘s’ కానీ ‘es’ కానీ చేరటం ఉండదు.
అయితే subject వేరే person అయితే do not ను వాడాలి. ఉదాహరణకు క్రింది వాక్యాలు చూడండి.
Affirmative
sentences:
·
I watch movies. - నేను సినిమాలు చూస్తాను.
·
They play cricket. - వారు క్రికెట్
ఆడతారు.
Negative
sentences:
·
I do not watch movies. – నేను సినిమాలు చూడను
·
They do not play cricket. - వారు క్రికెట్ ఆడరు.
Simple present tense ను question sentences లో వాడాలంటే ఈ క్రింది విధంగా వాడతారు.
ఉదాహరణకు పైన వాక్యాలే తీసుకుందాం.
Question
sentences:
·
Do they play cricket? - వారు క్రికెట్ ఆడతారా?
·
Does he speak French? - అతడు ఫ్రెంచ్
మాట్లాడతాడా?
వీటికి సమాధానం అవును (yes) అయితే affirmative sentence నూ, కాదు (no) అయితే negative sentence ను వాడటం జరుగుతుంది.
దేని గురించైనా సమాచారం (information) అడుగుతున్నప్పుడు కూడా simple present tense ను వాడతారు. అంటే information questions కు కూడా దీనిని వాడటం జరుగుతుంది.
·
When do I receive my books? – నా పుస్తకాలు
ఎప్పుడు వస్తాయి?
·
Where does he live? - అతడు ఎక్కడ
నివసిస్తాడు?
ఇలా ఏదైనా ఒక విషయానికి సంబంధించి మనకు కావలసిన సమాచారం తెలుసుకోవటానికి అడిగే ప్రశ్నలు కూడా simple present tense లోనే ఉంటాయి. అయితే ఈ ప్రశ్నల్లో వాడదలిచిన question word తర్వాత do లేదా does వస్తుంది.
ఇటువంటి ప్రశ్నలు అడగటం కూడా చాలా సులువు. ఉదాహరణకు మొదటి ప్రశ్న తీసుకోండి.
·
I receive my books. - నేను నా పుస్తకాలు అందుకుంటాను (నా పుస్తకాలు వస్తాయి). దీనికి అర్థం ముందు చెప్పిన వాక్యమే అయినప్పటికీ వాడుకలో మనం అంత detail గా మాట్లాడం.
ఇది affirmative sentence. దీనికి when అనే question word ను, do అనే auxiliary verb ను చేరిస్తే information question తయారయ్యింది.
అయితే do చేర్చాలా లేక does చేర్చాలా అనే విషయం subject ను బట్టి ఉంటుంది కనుక మనకు subject ఏమిటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ subject ‘I’ కనుక do ను వాడాలి.
అలాగే పైన చెప్పిన ఇంకో వాక్యం తీసుకుందాం.
He lives (he live అని వాడకూడదు అని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు కదా!) - అతడు నివసిస్తాడు.
దీనికి where ను, does ను చేరిస్తే information question తయారయ్యింది.
·
Where does he live?
Does లో ‘es’ ఉంది కనుక verb లో ‘es’ కానీ, ‘s’ కానీ ఉండదు.
పైన ఇచ్చిన అన్ని రకాల వాక్యాల్లోనూ simple present tense లో do ను లేదా does ను వాడటం మీరు గమనించవచ్చు.
Comments
Post a Comment