Simple past tense

 Past tense అంటే భూతకాలం. గడిచిన కాలం గురించి ఈ  tense తెలియచేస్తుంది. Simple past tense ఎప్పుడో గడిచిన కాలంలో పూర్తి అయిన చర్య గురించి తెలియచేస్తుంది. అయితే అది అంతకు కొంచెంసేపటి క్రితమే అయిపోయి ఉండవచ్చు లేదా చాలాకాలం క్రితం అయిపోయి ఉండవచ్చు, అయితే అయిపోయి ఉండటం అనేది ముఖ్యం కానీ ఎప్పుడు అయిపోయిందనేది కాదు.  Simple past, past tense లోని ఒక ముఖ్యమైన కాలం. దీనిలో వాక్యం యొక్క నిర్మాణం క్రింది విధంగా ఉంటుంది. 

Subject + past tense verb + object

·        I ate an apple.

దీనిని ఎలాంటి పరిస్థితులో వాడతారో ఇప్పుడు చూద్దాం. 

1. గతంలో తరుచుగా, అప్పడప్పుడూ లేక ఎప్పుడూ జరిగిన విషయాల గురించి తెలియచేయటానికి ఈ tense ను వాడతారు. 

ఉదాహరణ: 

·        He often brought sweets to the school. - అతడు తరచూ పాఠశాలకు మిఠాయిలను తీసుకువచ్చాడు. 

పై ఉదాహరణలో అతడు  గతంలో తరచూ మిఠాయిలను స్కూలుకు తీసుకు వచ్చేవాడని అర్థమవుతుంది. 

2. గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలో జరిగిన విషయాలను తెలియచేయడానికి ఈ tense ను వాడతారు. అంటే  last week, yesterday వంటివాటిని చెప్పటానికి simple past tense ను వాడతారు. 

ఉదాహరణ: 

·        She went to a movie last week. - ఆమె గతవారం సినిమాకు వెళ్ళింది. 

ఇక్కడ time అనేది specific గా చెప్పబడింది. 

3. అలాగే గతంలో నిర్దిష్టం కాని సమయంలో జరిగిన విషయాలను తెలియచేయడానికి కూడా ఈ tense ను  వాడతారు. అంటే  a long time ago, the other day వంటివాటిని చెప్పటానికి simple past tense ను వాడతారు. 

ఉదాహరణ: 

·        Ram played guitar when he was a child. - తన చిన్నప్పుడు రామ్ గిటార్ వాయించాడు. 

ఇక్కడ time అనేది చెప్పబడినప్పటికీ అది specific గా లేదు. రామ్ చిన్నప్పుడు అంటే అతని చిన్నతనంలో అని చెప్పబడింది కానీ అతనికి ఎన్నేళ్ల వయసులో అనేది స్పష్టంగా తెలియదు. 

4. అలాగే ‘ago’ అనేది కూడా past tense లో వాడతారు. ఇది వాడినప్పుడు దాని ముందర ఇచ్చిన సమయాన్ని బట్టి, అది ఆ చెప్పిన సమయానికి అంత ముందర జరిగిందని అర్థం. 

ఉదాహరణలు: 

·        One minute ago, two years ago, one week ago etc. అంటే ఒక నిముషం క్రితం, రెండేళ్ల క్రితం లేదా  రెండేళ్ల క్రిందట, ఒక వారం క్రితం మొదలైనవి.

Simple past tense ను negative sentences and interrogative sentences లో వాడేటప్పుడు did అనే auxiliary verb ను వాడటం జరుగుతుంది. Main verb మాత్రం present tense లోనే  ఉంటుంది.  

Negative sentences లో present tense verb కు ముందు did వచ్చి, దాని తర్వాత not వస్తుంది. ఎందుకంటే did అనేది past tense verb కనుక, main verb మాత్రం present tense లోనే ఉంటుంది. అయినప్పటికీ did ను వాడటం జరిగింది కనుక sentence past tense లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.  అంటే present tense verb కు ముందు did not  వస్తుంది. దీనిని బట్టి అది past tense అని మనకు అర్థం అవుతుంది.

ఉదాహరణలు: 

·        He did not go there. – అతడు అక్కడికి వెళ్ళలేదు. 

·        They did not play cricket. - వారు క్రికెట్ ఆడలేదు.

పైన వాక్యాలనే  question sentences లో  వాడాలంటే ఈ క్రింది విధంగా వాడతారు. 

Question sentences:  

·        Did he go there? - అతడు అక్కడికి వెళ్ళాడా?

·        Did they play cricket? - వారు క్రికెట్ ఆడారా?

వీటికి సమాధానం అవును (yes) అయితే affirmative sentence నూ, కాదు (no) అయితే negative sentence ను వాడటం జరుగుతుంది.  అయితే affirmative sentences లో మాత్రం past tense verb ను మాత్రమే వాడాలి. 

Affirmative sentences:  

He went there. - అతడు అక్కడికి వెళ్ళాడు.

They played cricket. - వారు క్రికెట్ ఆడారు. 

Comments

Popular posts from this blog

Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

Adjective (విశేషణం) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu