Present perfect tense

 Present perfect tense అనేది past tense, present tense కు మధ్య connection లాగా పని చేస్తుంది. అప్పుడే పూర్తి అయిన పనిని తెలియచేయటానికి, ఏదో ఒక action past లో మొదలై present లో కొనసాగుతూ ఉంటే అలాంటివాటిని తెలియచేయటానికి present perfect tense వాడతారు. అంటే action యొక్క time అంటే మాట్లాడుతున్న సమయానికి ముందు మొదలై ఉంటుంది, కానీ ఆ time ఎప్పుడో చెప్పబడదు.

Present perfect tense గురించి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే work and action మొదలైన సమయం తెలిస్తే, దానిని ఈ tense లో చెప్పటానికి వీలులేదు. అయితే past లో మొదలై ఇంకా జరుగుతూ ఉన్నప్పుడు ఆ work and action గురించి చెప్పటానికి ఈ tense ను వాడవచ్చు. 

Present perfect tense లో వాక్యం యొక్క structure క్రింది విధంగా ఉంటుంది. 

Subject + have / has + past participle + object

దీంట్లో has ను third person singular కు వాడతారు. మిగిలిన persons అన్నింటికీ have ను వాడతారు.

·        I have gone to a movie. - నేను సినిమాకు వెళ్ళాను.

Present perfect tense ను ఈ క్రింది పరిస్థితుల్లో వాడతారు.

అప్పుడే పూర్తి అయిన పనిని తెలియచేయటానికి present perfect tense ను వాడతారు. అంటే సాధారణంగా మనం ‘just’ అని వాడి చెప్పటం జరుగుతుంది, కానీ ఈ tense ను వాడి చెప్పినప్పుడు, ఆ పని ఇప్పుడే పూర్తి అయిందని అర్థం. 

·        I have finished my homework. - నేను నా హోమ్ వర్క్ పూర్తి చేశాను.

ఇక్కడ హోమ్ వర్క్ చేయటం ఇప్పుడే అయిపోయందని అర్థం. 

గతంలో ప్రారంభించి ప్రస్తుతం కొనసాగుతున్న ఒక action లేదా situation ను తెలియచేయటానికి వాడతారు.

·        I have lived in Mumbai since 2000.

అంటే 2000 వ సంవత్సరం నుండి నేను ముంబైలో ఉంటున్నాను, అంటే ఇప్పటికి కూడా ఉంటూనే ఉన్నాను అనే అర్థం వస్తుంది. 

గతంలోనూ, ఇప్పుడూ నిర్దిష్టంగా చెప్పటానికి వీల్లేని సమయంలో పునవరావృతమైన చర్యల (repeated actions) గురించి చెప్పటానికి వాడతారు.

·        Ram has visited London many times.

ఇక్కడ రామ్ అనేకసార్లు లండన్ వెళ్లి వచ్చాడనే విషయం తెలియచేయటానికి ఈ tense ను వాడటం జరిగింది. అయితే వెళ్లి వచ్చిన సమయం మాత్రం చెప్పబడలేదు.

ఒక నిర్దిష్ట వ్యవధిలో జరిగిన ఒక చర్య అది ఇంకా పూర్తి కాకపోతే, దానిని present perfect tense లో చెప్పటం జరుగుతుంది.

·        Sita have had several exams in his month.

ఇక్కడ exams జరుగుతున్న month ఇంకా పూర్తి కాలేదని అర్థం. 

జరిగిన అసలు సమయం గురించి ప్రస్తావించకుండా చర్య యొక్క ఫలితంపై నొక్కి చెప్పటానికి ఈ tense ను వాడటం జరుగుతుంది.

·        I have given him a note book.

ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడనేది చెప్పకుండా ఇవ్వటం జరిగిన విషయాన్ని మాత్రం చెప్పటం జరిగింది.

Negative sentences లో present perfect tense ను వాడాలంటే ‘not’ ను have లేదా has కు తర్వాత చేరిస్తే సరిపోతుంది.

·        He has not finished his homework.  - అతడు హోమ్ వర్క్ చేయలేదు.

పై ఉదాహరణలో not అనేది has కు తర్వాత రావటం మీరు గమనించవచ్చు. దీనిలో నుండి కేవలం not ను తొలగిస్తే వాక్యం positive గా మారిపోతుంది. 

Present perfect tense ను interrogative sentences లో వాడాలంటే మొదట have లేదా has ను వాడి, తర్వాత subject ను వాడాలి. దాని తర్వాత past participle ను, object ను వాడాలి.

క్రింది వాక్యం చూడండి. దీనిలో మూడూ, positive, negative and interrogative sentences ఎలా ఏర్పడతాయో మీరు గమనించవచ్చు.

·        They have eaten an apple. – positive sentence

·        They have not eaten an apple. – negative sentence

·        Have they eaten an apple? – interrogative sentence

వాక్యంలోని subject ను, have లేదా has ను reverse చేస్తే question form అవుతుంది.

Comments

Popular posts from this blog

Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

Adjective (విశేషణం) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu