Present perfect continuous tense

Present perfect continuous tense కూడా past tense, present tense కు మధ్య connection లాగా పని చేస్తుంది. ఎందుకంటే ఒక work and action past లో మొదలై present లో కొనసాగుతూ ఉంటే అలాంటివాటిని present perfect continuous tense లో చెప్తారు. అంతేకాకుండా ఈ action future లో కూడా కొనసాగవచ్చు. 

Present perfect continuous tense time ను  కూడా ఖచ్చితంగా తెలియచేస్తుంది. అంటే work and action past లో ఎప్ప్పుడు మొదలైంది లేదా ఎంతకాలం నుండి కొనసాగుతూ వస్తోంది అనే విషయాన్ని ఈ tense తెలియచేస్తుంది. గతానికి, ఇప్పటికి మధ్య ఒక నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి కాని పనిని తెలియచేయటానికి ఈ tense ను వాడతారు.

Present perfect continuous tense లో వాక్యం యొక్క structure క్రింది విధంగా ఉంటుంది. 

·        Subject + have / has + been + present tense verb + ing + time reference

దీంట్లో has ను third person singular కు వాడతారు. మిగిలిన persons అన్నింటికీ have ను వాడతారు.

·        I have been living in Hyderabad since 2000.

Since, for అనే రెండూ time reference ను తెలియచేయటానికి ఈ tense లో ఎక్కువగా వాడటం జరుగుతుంది.  Since ను point of tme ను తెలియచేయటానికి, for ను period of tme ను తెలియచేయటానికి వాడతారు.

Present perfect continuous tense ను ఈ క్రింది పరిస్థితుల్లో వాడతారు.

1. ఎప్పుడో past లో మొదలై ఇంకా present లో కొనసాగుతున్న పనిని తెలియచేయానికి  present perfect continuous  tense ను వాడతారు.

·        She has been waiting for the bus for two hours.

ఇక్కడ ఆమె రెండు గంటల నుండీ బస్సు కోసం ఎదురుచూస్తూ ఉందంటే, అది  చెప్పటానికి రెండు గంటల ముందు ఆ action మొదలై, ఇంకా కూడా కొనసాగుతూ ఉందని అర్థం. అంటే బస్సు వచ్చేవరకు ఆమె ఎదురు చూస్తూనే ఉంటుంది. అంటే future లో కూడా కొంతసేపు ఆ action continue అవ్వటానికి అవకాశం ఉంది. 

2. తాత్కాలికంగా కొంతకాలం కొనసాగిన అలవాట్లను తెలియచేయడానికి కూడా ఈ tense ను ఉపయోగించటం జరుగుతుంది. 

·        He has been going to a gym a lot recently.

అంటే ఇటీవలి కాలంలో అతడు చాలా ఎక్కువగా జిమ్ కు వెళ్ళేవాడని, ఆ అలవాటు కొంతకాలంపాటు కొనసాగిందనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఎంతకాలం అనే విషయం స్పష్టంగా చెప్పబడనప్పటికీ, ఒక certain time period ఈ పని కొనసాగిందనే విషయం మనకు తెలుస్తోంది. ఇటువంటి వాటికి present perfect continuous tense ను వాడతారు. 

3. అప్పుడే అయిపోయిన work and action యొక్క result ను తెలియచేయటానికి కూడా ఈ tense ను వాడతారు. ఇక్కడ time ను తెలియచేయటం ఉండదు, కానీ ఏ పని అయితే అప్పుడే పూర్తి అయిందో, దాని వలన వచ్చిన result మాత్రం తెలియచేయబడుతుంది. 

·        I have been running, so I am tired very much.

ఇక్కడ running వలన వచ్చిన result, అది ఏమిటంటే అలసిపోవటం అనేదానిని చెప్పటం జరుగుతోంది. 

Negative sentences లో present perfect continuous tense ను వాడాలంటే ‘not’ ను have లేదా has కు తర్వాత చేరిస్తే సరిపోతుంది.

·        We have not been reading the lesson for two hours.  - మేము రెండు గంటల నుండీ పాఠం చదవటం లేదు. 

పై ఉదాహరణలో not అనేది have కు తర్వాత రావటం మీరు గమనించవచ్చు. దీనిలో నుండి కేవలం not ను తొలగిస్తే వాక్యం positive గా మారిపోతుంది. 

Present perfect tense ను interrogative sentences లో వాడాలంటే మొదట have లేదా has ను వాడి, తర్వాత subject ను వాడాలి. దాని తర్వాత been, present tense verb + ing ను, object ను వాడాలి.

క్రింది వాక్యం చూడండి. దీనిలో positive, negative and interrogative sentences ఎలా ఏర్పడతాయో మీరు గమనించవచ్చు.

·        They have been working in this office for seven years. – Positive sentence

·        They have not been working in this office for seven years. – Negative sentence

·        Have they been working in this office for seven years? – Interrogative sentence

వాక్యంలోని subject ను, have లేదా has ను reverse చేస్తే question form అవుతుంది.

Comments

Popular posts from this blog

Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

Adjective (విశేషణం) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu