Present continuous tense
Present continuous tense ను మామూలుగా మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న చర్యలను అంటే the work and action that is happening at the time of speaking or happening now అనే వాటిని తెలియచేయటానికి ఉపయోగిస్తారు.
ఉదాహరణలు:
·
I am eating meals. - నేను అన్నం తింటూ ఉన్నాను.
·
Sam is playing cricket. - శామ్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.
పైన
ఉదాహరణలను గమనిస్తే అవి
మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న
చర్యలని అర్థం అవుతుంది.
Present continuous
tense sentences లో ఎలాంటి సమయం
చెప్పనవసరం లేదు. అంటే
past continuous tense or future continuous tense లో
లాగా ఎలాంటి సమయం
చెప్పనవసరం లేదు. వాటి
క్రియలను చూసి, వాక్యాలు
present continuous tense లో ఉన్నాయని
చెప్పవచ్చు.
ముందే
నిర్ణయించుకున్న లేదా
ఏర్పాటు చేసుకున్న భవిష్యత్తులో
జరిగే సంఘటనలను కూడా
present continuous tense లోనే చెప్తారు.
అంటే
the events that have already been arranged వంటి
వాటిని present continuous tense లో చెప్తారు.
·
I am going to doctor tomorrow. - నేను రేపు డాక్టర్ వద్దకు వెళ్ళబోతున్నాను.
·
Are you preparing anything on the
coming Sunday? - నువ్వు వచ్చే ఆదివారం ఏదైనా తయారుచేస్తున్నావా?
మాటిమాటికీ
జరుగుతున్న చర్యల వల్ల
విసుగు లేదా చిరాకు
పుట్టినప్పుడు కూడా present continuous
tense ను ఉపయోగిస్తారు.
ఇలాంటి
వాక్యాల్లో సాధారణంగా always ను
వాడటం జరుగుతుంది.
·
You are always criticizing me. – నువ్వు ఎప్పుడూ నన్ను విమర్శిస్తావు.
·
Why are you always coming late to
class? - నువ్వు ఎప్పుడూ తరగతికి ఎందుకు ఆలస్యంగా వస్తావు?
Present continuous
tense లో వాక్యం యొక్క
నిర్మాణం (structure) క్రింది విధంగా
ఉంటుంది.
Subject + be form +
main verb + ing + object
Be forms లో
am, is, are అనేవి present continuous లో
వాడబడతాయి.
Am అనేది
first person singular అంటే ‘I’ కు,
is అనేది third person singular కు
అంటే
‘he, she, it’ కు,
మిగిలిన వాటికి అంటే
we, you, they కు
are ను వాడతారు.
అంటే
subject ను బట్టి be form ఉంటుంది.
దాని తర్వాత main verb కు
ing form వచ్చి చేరుతుంది. దాని
తర్వాత object వస్తుంది.
క్రింది
వాక్యం చూడండి.
·
Children are playing basketball in
the ground.
ఇక్కడ
children అనేది third person plural కనుక
‘are’ ను వాడటం జరిగింది.
దాని తర్వాత main verb, ing
form, object ఇలా రావటం మీరు
గమనించవచ్చు.
Negative sentences లో
Present continuous tense ను వాడాలంటే
‘not’ ను
main verb కు ముందు చేరిస్తే
సరిపోతుంది.
ఉదాహరణలు:
·
He is not doing his homework. - అతడు
హోమ్ వర్క్ చేయటం
లేదు.
·
She is not reading the book. - ఆమె
పుస్తకం చదవటం లేదు.
పై
ఉదాహరణలలో not అనేది main verb కు
ముందు రావటం మీరు
గమనించవచ్చు. వాటిలో నుండి
కేవలం not ను తొలగిస్తే
వాక్యం positive గా మారిపోతుంది.
Present continuous
tense లో ప్రశ్నలను అడగాలంటే
లేదా
interrogative sentences లో దీనిని
వాడాలంటే మొదట be form ను
వాడి,
తర్వాత subject ను వాడాలి.
దాని తర్వాత main verb + ing,
object వస్తాయి.
క్రింది
వాక్యం చూడండి.
·
You are going to Mumbai. – positive
sentence
·
You are not going to Mumbai –
negative sentence
·
Are you going to Mumbai? –
interrogative sentence
Just subject ను,
be form ను
reverse చేస్తే question form అవుతుంది.
Comments
Post a Comment