Verbs (క్రియలు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

క్రియలను ఇంగ్లీషులో verbs అంటారు. Verbs ను బట్టి మనం ఆ వాక్యం ఏ కాలం (tense) లో ఉందో చెప్పవచ్చు. 

వీటిలో అనేక రకాలు ఉంటాయి. Physical verbs అనీ, mental verbs అనీ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇంకా main verbs, linking verbs అనేవి ఉన్నాయి. అంతేకాకుండా action verbs, transitive verbs, intransitive verbs, auxiliary verbs, stative verbs, modal verbs, phrasal verbs, irregular verbs అనే రకాలు కూడా ఇంగ్లీషులో ఉన్నాయి.  ఇప్పుడు మనం ప్రతి verb గురించి వివరంగా చూద్దాం. 

Physical verbs physical గా మనం చేసే పనిని తెలియచేస్తాయి. 

Ex: run, call, speak etc.

She called him.

అవగాహన, ఆలోచించటం, ప్రణాళిక వేయటం వంటివాటిని mental verbs అంటారు. అంటే ఇవి భౌతికంగా కనిపించవు, ఇంకోరకంగా చెప్పాలంటే చేసే పని బయటకు కనిపించకపోవచ్చు, కానీ క్రియ యొక్క చర్య తాలూకు ఫలితం అనేది కనిపిస్తుంది. 

Ex: think, believe, know etc.

I know the answer.

ఇంగ్లీషులో అనేక క్రియలను main verbs అనే చెప్పవచ్చు. ఇవి చర్యలను, సంఘటనలను, స్థితులను తెలియచేస్తాయి.

Ex: We went to home directly after meeting.

కొన్ని main verbs linking verbsగా వ్యవహరిస్తాయి. 

ఇవి objectను అనుసరించి ఉండటానికి బదులుగా subject గురించి అదనపు సమాచారాన్ని అందించే పదబంధాలను అనుసరించి ఉంటాయి. వీటిలో కొన్నిnoun phrases, adjective phrases etc.

Ex: She is a cousin of mine (noun phrase).

Action verbs: నిర్దిష్ట చర్యలను వ్యక్తం చేసేవాటిని action verbs అంటారు. 

Ex: give, eat, walk, drink etc.

Ravi drinks milk.

Action verbs లోనే transitive verbs, intransitive verbs అనే రకాలు ఉన్నాయి. 

Transitive verbs and intransitive verbs: Transitive verbs అనేవి ఎల్లప్పుడూ చేసే పనిని సూచించే క్రియలుగా ఉంటాయి. అంటే వీటికి direct object ఉంటుంది. అంటే చేయబడ్డ పని యొక్క ప్రతిఫలాన్ని పొందటానికి ప్రత్యక్షంగా ఎవరో ఒకరు లేదా ఏదో ఒకటి ఉంటుంది. 

Ex: Ram ate an apple.

ఇక్కడ apple direct objectగా అనుకోవచ్చు.

అయితే కొన్ని కొన్నిసార్లు transitive verbsకు indirect objects కూడా ఉంటాయి. అంటే ఎవరి కోసం లేదా దేనికోసం ఆ పని చేయబడిందో అది indirect object గా తీసుకోవచ్చు. 

Ex: Kamala gave Vimala a pencil.

ఇక్కడ direct object ‘pencil’, indirect object ‘Vimala’. అంటే ఏది ఇవ్వబడిందో అది direct object, ఎవరికి ఇవ్వబడిందో అది indirect object.

Direct object, indirect object రెండింటికీ కలిపి వాడే కొన్నిtransitive verbs ఈ క్రింద పేర్కొనబడ్డాయి. 

Give, take, buy, sell, make, pass, lend, cost, leave, show, lend, wish etc.

Intransitive verbs కు ఎప్పుడూ direct object ఉండదు. కొన్నిసార్లు object అసలే ఉండదు.  అంటే వీటి తర్వాత adverb కానీ, adverbial phrase కానీ వస్తుంది, అయితే చేయబడ్డ పని యొక్క ఫలితం పొందటానికి object ఉండదు. 

Ex: cry, laugh, talk, work etc.

Ram cried.

She laughed.

ఫైన ఇచ్చిన ఉదాహరణలను గమనిస్తే, రామ్ ఏడ్చినా, ఆమె నవ్వినా దాని తాలూకు ఫలితం పొందటానికి వేరే ఎవరూ  లేరు. ఇలాంటి వాటిని intransitive verbs అంటారు. 

కొన్ని verbs transitive verbs మరియు intransitive verbsగా ఉపయోగపడతాయి. వాక్యంలో verbను ఉపయోగించిన విధానాన్ని బట్టి అది transitive verb లేక intransitive verb అని చెప్పవచ్చు. 

క్రింది ఉదాహరణ చూడండి. 

He wrote a lesson. – Transitive verb

Kamala couldn’t write. – Intransitive verb

ఫైన ఇచ్చిన ఉదాహరణలను గమనిస్తే, మొదటి ఉదాహరణలో అతడు పాఠం వ్రాశాడు. రెండవ ఉదాహరణలో కమలకు వ్రాయటం రాదు. ఆ వాడిన విధానాన్ని బట్టి అది ఏ రకమైన verb అనేది చెప్పవచ్చు. 

Auxiliary verbs: Auxiliary verbsను ఇంకోరకంగా helping verbs అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి main verbs కు సహాయం చేస్తాయి. వీటి సహాయంతో మనం వాక్యాన్ని వివిధ tenses, moods, voiceలలో వ్రాయవచ్చు. ఒక్కొక్క auxiliary verb ఒక్కొక్కరకంగా ఉపయోగపడుతుంది. వీటి గురించి మనం వివరంగా ఇంకో పాఠంలో చూద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే auxiliary verbs, main verbs కు సహాయం చేస్తాయి అంటే వేరే verb యొక్క actionను వ్యక్తీకరించటానికి ఉపయోగపడతాయి కనుక వీటిని helping verbs అని అంటారు.

Ex: be, can, shall, will etc.

I can do this work.

పైన ఇచ్చిన వాక్యంలో do అనేది main verb, can అనేది auxiliary verb. ఇక్కడ do యొక్క ability ని ‘can’ వ్యక్తం చేయటం ద్వారా దాని యొక్క పూర్తి భావాన్ని తెలియచేస్తోంది కనుక can auxiliary verb లేదా helping verb అయ్యింది.

Stative verbs: Stative verbs అనేవి చేసే చర్య కన్నా ఉన్న స్థితిని తెలియచేస్తాయి. ఇవి సాధారణంగా ఆలోచనలను, భావోద్వేగాలను, సంబంధాలను, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శక్తిని, భావాలను, స్థితిని తెలియచేస్తాయి

Ex: see, taste, hear, recognize etc.

I saw Latha in the market.

పైన ఇచ్చిన వాక్యంలో ‘saw’ అనేది జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శక్తిని తెలియచేస్తోంది.

Modal verbs: Modal verbs సామర్ధ్యాలను, అవకాశాలను, అనుమతులను మరియు బాధ్యతలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహాయక క్రియలు. 

Ex: can, may, shall, must etc.

I may help you in this matter.

పైన ఇచ్చిన వాక్యంలో ‘may’ అనేది help  చేయటానికి కల శక్తిని, అవకాశాన్ని లేదా సామర్ధ్యాన్ని తెలియచేస్తోంది. 
Phrasal verbs: Phrasal verbs అనేవి ఒకే పదం కాదు, అవి అసలు క్రియ యొక్క వేరొక అర్థాన్ని తీసుకోవడానికి ఉపయోగించే కొన్ని పదాల కలయికలు. అంటే దీంట్లో కనిపించే అర్థం కన్నా దాగి ఉన్న అర్థం ఇంకొకటి ఉంటుంది. సాధారణంగా phrasal verb అనేది main verb, adverb తో కానీ, preposition తో కానీ లేదా రెండింటితో కానీ కలవటం ద్వారా ఏర్పడుతుంది. ఇవి transitive మరియు intransitive verbs గా ఉంటాయి. 

Ex: turn on, break up, set off, look down etc.

I turned off the computer.

పైన ఇచ్చిన వాక్యంలో ‘turn’ మరియు ‘off’ అనే రెండూ కలిసి ‘turn off’ అనే phrasal verb గా ఏర్పడ్డాయి. అనేక రకాల phrasal verbs ఉన్నాయి. ప్రతిదానికీ వేర్వేరు అర్థం ఉంది. కనుక వాటి గురించి మీరు వేరే పాఠంలో వివరంగా తెలుసుకోవచ్చు. 
Irregular verbs: సాధారణంగా verbs అనుసరించే ప్రక్రియను అనుసరించని వాటిని irregular verbs అంటారు. మామూలుగా ఇవి paste tense verbs లేదా verb యొక్క past participle form అయి ఉంటాయి. 
Verbs కొన్ని నియమాల ప్రకారం వివిధ కాలాల్లో ఏర్పడతాయి, అయితే ఈ irregular verbs ఆ ప్రకారం ఏర్పడవు. ఉదాహరణకు present tense verb కు ‘d’ కానీ ‘ed’ కానీ చేరిస్తే past tense verb ఏర్పడుతుంది (call – called). అయితే irregular verbs విషయంలో అలా జరగదు. 

Ex: come – came – come, drink – drank – drunk, eat – ate – eaten, fall – fell – fallen etc.

He comes to my home. (Present tense verb)

He came to my home. (Past tense verb)

He has come to my home. (Past participle)

Irregular verbs ఎన్నో ఉన్నాయి. అయితే వాడకంలో ఉన్నవి 200 కన్నా ఎక్కువని చెప్తారు. వీటి గురించి మీరు వివరంగా ఇంకో పాఠంలో తెలుసుకోవచ్చు.

Irregular verbs లో అనేక రకాలు ఉన్నాయి. Strong verbs, weak verbs, prefixed verbs etc. 


Published by Praveen Ragi, PR Learning Lab, WhatsApp: +91 8978500864, Email: praveen2006@gmail.com
Visit our YouTube Channel PR Learning Lab for more videos.
Follow us on our WhatsApp group: https://chat.whatsapp.com/DqrACbkKCJ3EfPmteeOPnB

Comments

Popular posts from this blog

Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

Adjective (విశేషణం) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu