Pronoun (సర్వనామం) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
Pronoun అంటే సర్వనామం. ఇది nounకు బదులుగా వాడబడుతుంది. I, we, you, he, she, it, they మొదలైనవాటిని pronouns అంటారు.
Pronounsలో personal pronouns, possessive
pronouns, indefinite pronouns, intensive pronouns, reflexive pronouns,
demonstrative pronouns, interrogative pronouns,
subjective pronouns, objective pronouns, reciprocal pronouns మరియు relative pronouns అనే రకాలు ఉంటాయి.
Personal pronoun: Personal pronoun వ్యక్తులను (persons) గురించి తెలియచేస్తుంది.
వివిధ రకాల persons క్రింది విధంగా ఉంటాయి.
1st person singular – I, 1st person
plural – we
2nd person singular and plural – you
3rd person singular – he, she, it
and 3rd person plural – they
అంతే కాకుండా, gender గురించి, number గురించి ఇవి తెలియచేస్తాయి. అంటే ఎంతమంది ఉన్నారు, అది ఏకవచనమా లేక బహువచనమా (singular or plural), వారు స్త్రీలా, పురుషులా అనేది కూడా personal pronoun వలన తెలుసుకోవచ్చు.
Ex: I, me, she, he
etc.
పైన చెప్పబడిన ఉదాహరణలో she ని చూస్తే అది third person అనీ, singular అనీ, feminine gender అనీ తెలుస్తుంది.
Possessive
pronoun: Possessive pronouns స్వాధీనతను తెలియచేస్తాయి. అంటే వేటి గురించి చెప్తున్నామో అవి subject లో చెప్పబడిన pronoun కు చెందినవని తెలియచేస్తాయి.
Ex: his, her, mine,
ours etc.
This is his
book.
ఇక్కడ అతడి పుస్తకం అంటే పుస్తకం అతడికి చెందిందని చెప్పటం జరిగింది.
Possessive pronouns లో రకాలు ఉన్నాయి. ఇవి absolute possessive pronouns మరియు pronominal possessive pronouns
అని రెండు రకాలు.
Absolute possessive pronouns అనేవి వాస్తవంగా pronouns అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి అంతకు మునుపు చెప్పబడిన noun కు బదులుగా వాడబడతాయి. వీటి తర్వాత ఎలాంటి noun వాడవలసిన అవసరం లేదు.
Ex: mine, yours, theirs,
hers etc.
This car is ours.
ఇక్కడ ఈ కారు మాది అని చెప్పబడింది. ’Our” తర్వాత ఎలాంటి ‘noun’
లేదు.
అలాకాకుండా this
is our car అంటే ఇది మా కారు, ఇక్కడ ‘our’ తర్వాత
‘car’ అనే noun
వచ్చింది.
Pronominal possessive pronouns ను ఇంకోరకంగా adjectives అని కూడా అనుకోవచ్చు. వీటి వాడకం తర్వాత noun వస్తుంది.
Ex: my, your,
their, her etc.
This is my
money.
పైన ఇవ్వబడిన ఉదాహరణలో ఇది నా డబ్బు అనటం జరిగింది. ఇక్కడ ‘నా’ అనే possessive pronoun తర్వాత ‘డబ్బు’ అనే noun వచ్చింది.
Indefinite pronoun: Indefinite pronouns - వీటి పేరుకు తగినట్లు definite గా వేటినీ తెలియచేయవు. ఇవి మామూలుగా కొన్ని వస్తువులను, మనుష్యులను సూచిస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలానావి అని చెప్పటం జరగదు. అంటే ఖచ్చితంగా వేటిని సూచిస్తాయో ఇవి తెలియచేయవు.
Ex: anyone,
something, all, few etc.
పైన పేర్కొన్న ఉదాహరణలలో ఏవీ కూడా ఒక specific noun ని తెలియచేయటం లేదు. Anyone అంటే ఎవరైనా కావచ్చు, something అంటే ఏదైనా కావచ్చు, all అంటే అన్నీ, few అంటే కొన్ని. వీటిలో ఏదీ కూడా ఫలానాది అని specific గా తెలియచేయటం లేదు. అందుకే వీటిని indefinite pronouns అంటారు.
Intensive pronoun: Intensive pronouns ఏదైనా noun ను కానీ, pronoun ను కానీ నొక్కి చెప్పటానికి ఉపయోగపడతాయి. దీనిలో singular అయితే self ను మరియు plural అయితే selves ను వాడటం జరుగుతుంది. Ex: myself, yourself, himself,
herself etc.
He himself drove the car.
ఇక్కడ himself అనేది he అనేదానిని నొక్కి చెప్పటానికి ఉపయోగించటం జరిగింది.
Reflexive pronoun: Reflexive pronouns వాక్యం యొక్క కర్త (subject)ను సూచించటానికి ఉపయోగిస్తారు. దీనిలో కూడా self ను మరియు selves ను వాడటం జరుగుతుంది
Ex: myself,
yourself, himself, herself etc.
He will go to the school himself.
Subject ను emphasize చేయటానికి కూడా వీటిని వాడటం జరుగుతుంది.
Demonstrative pronoun: ప్రత్యేకించి
ఎవరినైనా లేక దేనినైనా సూచించటానికి demonstrative pronouns వాడతారు. ఇవి ఐదు
- this, that, these, those and such.
Ex: These
are really awesome.
అయితే కొన్ని కొన్నిసార్లు వీటిని nounకు ముందు వాడటం జరుగుతుంది,
అటువంటప్పుడు ఇవి adjectivesగా పనిచేస్తాయి,
కానీ
pronouns వలే కాదు
Ex: Give me that
pen (adjective).
Give me that
(pronoun).
పైన చెప్పబడిన ఉదాహరణలలో మొదటిదాంట్లో that అనేదాని తర్వాత pen అనే noun వాడబడింది. రెండవదాంట్లో ఎలాంటి noun ను వాడటం జరగలేదు, కనుక దీనిని అంటే that అనేదానిని pronoun గా వాడటం జరిగింది.
Interrogative
pronoun: ప్రశ్నించటానికి వాడే pronounsను interrogative pronouns అంటారు. అంటే ఈ pronouns వలన ప్రశ్నలు తయారవుతాయి.
Ex: what, who,
which, whom etc.
What are you bringing
for me?
ఇక్కడ ఏమి తీసుకురాబడుతోందో దానికి బదులుగా ‘what’ అనే interrogative pronoun ను వాడటం జరిగింది.
Subjective and Objective pronouns: Subjective
pronounను సాధారణంగా వాక్యం మొదట్లో వాడటం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు ఇవి మధ్యలో కూడా వాడవచ్చు, అయితే కర్త (subject) గా వీటిని వాడినప్పుడు వీటిని subjective pronouns అంటారు. అంటే వాక్యంలోని పనిని ఎవరు చేస్తారో వారిని సూచించే pronoun ను subjective pronoun అంటారు.
Ex: He broke
my window glass.
ఇక్కడ window glass అతని చేత break చేయబడింది. అందుకని ‘he’ అనేది subjective pronoun.
దీనికి విరుద్ధంగా వాక్యములోని object ను తెలియచేసేవి objective pronouns. అంటే వాక్యంలోని క్రియ యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో లేదా క్రియా ఫలితం ఎవరికి చెందుతుందో, దానిని సూచించే pronounను objective pronoun అంటారు. ఇవి సాధారణంగా క్రియ (verb) తర్వాత వస్తాయి.
Ex: Mom told me
a story.
ఇక్కడ అమ్మ కథ చెప్పింది, ఎవరికి? నాకు, కనుక me అనేది objective pronoun.
Reciprocal pronoun: ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఏదో ఒక చర్యను చేశారని సూచించడానికి reciprocal pronounని ఉపయోగిస్తారు. ఈ చర్య యొక్క పర్యవసానాలను వారిరువురు స్వీకరిస్తారు.
Ex: each other, one another
ఇద్దరు ఉంటే each other ను, అంతకంటే ఎక్కువమంది ఉంటే one another ను ఉపయోగిస్తారు.
Ex: Sita and Gita gave each other
gold bangles on their birthday.
The students in the class greeted one
another before seminar.
పైన ఇచ్చిన ఉదాహరణలను గమనిస్తే మొదటిదాంట్లో ఇద్దరు వ్యక్తులను సూచించటం జరిగింది. కనుక each other ను వాడటం జరిగింది. రెండవదాంట్లో ఇద్దరికంటే ఎక్కువమంది ఉన్నారు కనుక one another ను వాడటం జరిగింది.
Relative pronoun: Relative pronouns ఒక noun లేదా pronoun తో ఒక క్లాజు లేదా పదబంధాన్ని అనుసంధానించడానికి ఉపయోగించబడతాయి. అంటే ఇవి వాక్యంలోని noun లేక pronoun కు clause తో ఉన్న పరస్పర సంబంధాన్ని తెలియచేస్తాయి.
Ex: who, whatever,
whichever, whose, that etc.
This is the ice cream that I
want to eat.
The driver who jumped the
signals was stopped by the police.
పైన ఇచ్చిన
ఉదాహరణలను గమనిస్తే మొదటి ఉదాహరణలో ఏ ఐస్ క్రీమ్ నేను తినాలనుకున్నానో అది ఇదే అని
చెప్పటం జరిగింది.
రెండవ ఉదాహరణలో సిగ్నల్ ను జంప్ చేసిన డ్రైవర్ ను పోలీసు పట్టుకున్నాడు, అంటే ఎవరైతే సిగ్నల్ ను జంప్ చేశారో వారిని పోలీసు
పట్టుకున్నాడు అని చెప్పటం జరిగింది.
Published by: Praveen Ragi, PR Learning Lab, WhatsApp: 0091 8978500864, Email: praveen2006@gmail.com,
Follow us on our WhatsApp group: https://chat.whatsapp.com/DqrACbkKCJ3EfPmteeOPnB
Comments
Post a Comment