Noun (నామవాచకము) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

నామవాచకాన్ని ఇంగ్లీష్ లో noun అంటారు.

Definition: A noun is a naming word. It is the name of a person, place or thing.

Person - Ex: Venkat, Ramesh, Sweta, Girija

Place - Ex: Secunderabad, Karimnagar, Vijayawada

Thing - Ex: Table, book, pen

దీనిలో అనేక రకాలు ఉన్నాయి. ఇవి common noun, proper noun, abstract noun, concrete noun, material noun compound noun, collective noun, countable noun, uncountable noun మొదలైనవి. ఇంకా singular noun, plural noun, possessive noun వంటివి కూడా ఉన్నాయి. ఒక noun ఒకే కేటగిరీకి చెంది ఉండాలనే నియమం లేదు. ఒక noun రెండు, మూడు రకాలకు కూడా చెంది ఉండవచ్చు. ఉదాహరణకు happiness అనేదాన్ని common noun గానూ, abstract noun గానూ తీసుకోవచ్చు.

ఇప్పుడు మనం ప్రతీ రకం గురించి వివరంగా చూద్దాం. 

ప్రాథమికంగా nounsను రెండు రకాలుగా విభజించవచ్చు.

Abstract noun: మన జ్ఞానేంద్రియాలతో మనం పొందలేని వాటిని abstract nouns అంటారు. అంటే వీటిని వాస్తవంగా చూడలేము, తాకలేము. అంటే వీటిని అనుభూతి చెందగలం లేదా మన మనస్సుతో వాటిని గ్రహించగలం కానీ నిజానికి వీటిని పంచేంద్రియాలతో అనుభవించలేము. 

Ex: Truth, danger, friendship, love etc.

పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే  నిజం, అపాయం, స్నేహం, ప్రేమ వంటివి చెప్పబడ్డాయి. వీటిని మనం మన మనస్సుతో మాత్రమే అనుభూతి చెందగలం. ఇలాంటి nouns ను abstract nouns అంటారు. 

Concrete noun: భౌతికంగా ఉండి జ్ఞానేంద్రియాలతో మనం పొందగల nounsను concrete nouns అంటారు. అంటే వాటి, వాటి స్థితిని బట్టి వీటిని మనం చూడగలం, తాకగలం, రుచి, వాసన చూడగలం. ఎందుకంటే ఇవి భౌతికంగా ఉంటాయి కనుక. 

Ex: chair, house, ocean, pen, flower, coffee etc.

పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే  ఇచ్చిన నాలుగింటిని మనం చూడగలం, flower ను వాసన చూడగలం, coffee ని రుచి చూడగలం.  ఇలాంటి nouns ను concrete nouns అంటారు. 

Common noun: మామూలుగా ఏదైనా వస్తువుల, ప్రజల, ప్రదేశాల యొక్క విషయాలను common noun తెలియచేస్తుంది. అయితే వీటి యొక్క ప్రత్యేకమైన పేర్లను ఇది తెలియచేయదు. అంటే ఇవి సాధారణమైన విషయాలకు సంబంధించినవే ఉంటాయి అంటే మొత్తంగా ఉంటాయి కానీ, ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క లేదా ప్రదేశం యొక్క పేరును common noun తెలియచేయదు.

Ex: country, boy, girl, city etc.

ఇక్కడ పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే దేశం, బాలుడు, బాలిక, పట్టణం అని మామూలుగా వాటి గురించి తెలియచేయబడిందే కానీ, ఆ దేశం పేరు లేదా పట్టణం పేరు కానీ తెలియచేయబడలేదు. ఇలాంటి వాటిని common nouns అంటారు. 

Proper noun: ప్రత్యేకంగా ఒక వ్యక్తి, స్థలం లేదా దేశం యొక్క పేరును తెలియచేయడానికి proper noun ను వాడతారు. ఇవి వ్యక్తుల యొక్క లేదా ప్రదేశాల యొక్క పేర్లను తెలియచేస్తాయి.  ఇవి ఎప్పుడూ పెద్ద అక్షరం (capital letter) తోనే మొదలవుతాయి. 

Ex: India, Ram, Sita, Warangal etc.

పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే  దేశం యొక్క, బాలుడు లేదా  బాలిక యొక్క, అలాగే పట్టణం యొక్క పేర్లు చెప్పబడ్డాయి. ఇలాంటి వాటిని proper nouns అంటారు. 

Material noun: Material noun దాని పేరుకు తగినట్లు ఏదైనా పదార్థాల పేర్లను, మిశ్రమాల పేర్లను తెలియచేస్తుంది. ఒకరకంగా పదార్థాల పేర్లను తెలియచేసే common noun ను material noun అనుకోవచ్చు. సాధారణంగా material noun ను మనం లెక్కపెట్టలేము. ఎందుకంటే అవి లెక్కపెట్టటానికి వీలు లేని విధంగా పూర్తి ఘన పదార్థ రూపంలో కానీ లేదా ద్రవ పదార్థ రూపంలో కానీ, లేక కొంత మటుకు ద్రవ పదార్థ రూపంలో కానీ ఉంటాయి. ఆ పదార్థం యొక్క పరిమాణం చెప్తున్నప్పుడు మాత్రమే వాటిని లెక్కపెట్టటానికి వీలు అవుతుంది. ఉదాహరణకు milk ను మనం లెక్కపెట్టలేము, కానీ glass of milk లేదా one cup of milk అనవచ్చు, అటువంటి సమయంలో వాటిని లెక్కపెట్టటానికి వీలు అవుతుంది. 

Ex: cotton, cloth, gold, salt, perfume etc.

ఇక్కడ పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే ఇవి అన్నీ ఏదో ఒక పదార్థం లేక మిశ్రమానికి సంబంధించినవి, అంతే కాకుండా వీటిలో వేటినీ మనం లెక్కపెట్టలేము. అందుకే వీటిని material noun అంటారు. 

వీటిలో కొన్ని nouns కు మనం plurals కూడా form చేయలేము. ఉదాహరణకు gold, air, fiber, aluminum, honey వంటివాటిని తీసుకుంటే వీటికి plural forms ఉండవు. 

Compound noun: రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఉన్నnounsను compound nouns అంటారు. అంటే రెండు పదాలు కలిసి ఒకే noun గా ఏర్పడతాయి. అయితే వీటిని రెండు పదాలు కలిసి మొత్తం ఒకటిగా ఉన్న రూపంలో వ్రాయవచ్చు లేదా మధ్యలో hyphen పెట్టి వ్రాయవచ్చు లేదా రెండు పదాలు విడివిడిగా వ్రాయవచ్చు. 

Ex: toothpaste, tablecloth, daughter-in-law, post office etc.

పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే  మొదటి రెండు ఉదాహరణలలో రెండు పదాలు కలిసి ఒకే పదంలో ఒకే రూపంగా ఉన్నాయి, మూడవదాంట్లో hyphen పెట్టి ఉంది, నాలుగవదాంట్లో రెండు పదాలు విడివిడిగా వ్రాయబడ్డాయి. 

Collective noun: వస్తువుల సముదాయం యొక్క లేదా మనుష్యుల యొక్క గ్రూపులను తెలియచేసే nouns ను collective nouns అంటారు. వీటిని అమెరికన్ ఇంగ్లీషులో ఏకవచనంగా భావించి ఏకవచన క్రియను వాడతారు. అయితే బ్రిటిషు ఇంగ్లీషులో బహువచనంగా భావించి బహువచన క్రియను వాడటం కూడా సరైనదిగానే భావిస్తారు.

Ex: audience, flock, family, team etc.

American English: The whole family is at the table.

British English: The whole family are at the table.

పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే  అమెరికన్ ఇంగ్లీషులో మొత్తం familyని ఏకవచనంగా భావించటం జరిగింది, అదే బ్రిటిషు ఇంగ్లీషులో మొత్తం  family ని బహువచనంగా భావించటం జరిగింది.

Countable noun: ఏదైనా లెక్కపెట్టగలిగే nouns ను countable nouns అంటారు. ఇవి singular గానూ, plural గానూ ఉండవచ్చు. వీటిని మనం లెక్కపెట్టగలం.

Ex: one book, two pencils, a boy, several cities etc.

ఇక్కడ పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే book, pencil, boy, cities - ఇలా వీటన్నింటినీ మనం లెక్కించగలం.  ఇలాంటి వాటిని countable nouns అంటారు.

Uncountable noun: వేటినైనా లెక్కించటానికి వీలు లేని nounsను uncountable nouns అంటారు. అంటే వీటిని విడిగా లెక్కించటానికి సాధ్యపడదు.  ఇవి లెక్కపెట్టటానికి వీలులేనప్పటికీ, వ్యక్తిగతంగా లేక ఏకవచనంగా ఉండనప్పటికీ, వీటిని ఎప్పుడూ ఏకవచనం (singular) గానే తీసుకోవాలి, ఏకవచన క్రియలే (singular verbs) వాడాలి.

Ex: rice, water, furniture, money etc.

పైన చెప్పబడిన ఉదాహరణలలో వేటినీ మనం లెక్కపెట్టలేము. అంటే వాటిని విడిగా లెక్కపెట్టలేము. ఉదాహరణకు పాలని (milk) మనం లెక్కపెట్టలేము. అయితే ఒక లీటరు పాలు, ఒక బాటిల్ పాలు ఇలా లెక్కపెట్టవచ్చు. అదే విధంగా  water, furniture, money ని  కూడా, ఇలాంటి వాటిని uncountable nouns అంటారు.

Singular noun: ఏదైనా ఒక వస్తువును, ఒక ప్రదేశాన్ని, ఒక జంతువుని, ఇలా ఏకవచనాన్ని తెలియచేసే noun ని singular noun అంటారు. 

Ex: bus, cat, house, river etc.

పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే  bus, cat, house, river - ఇలా అన్నీ కూడా singular ని తెలియచేస్తున్నాయి. కనుక వీటిని  singular nouns అంటారు.

Plural noun: ఒకటి కంటే ఎక్కువ ఉన్న వస్తువులను కానీ, ప్రదేశాలను కానీ, జంతువులను కానీ లేదా మనుష్యులను కానీ తెలియచే తెలియచేసే noun ని plural noun అంటారు.

Ex: boats, dogs, tomatoes, people etc.

పైన పేర్కొన్న nouns  అన్నీ ఒకటి కంటే ఎక్కువ వాటిని తెలియచేస్తున్నాయి.  ఇలాంటి nounsను plural nouns అంటారు.

సాధారణంగా singular nounకు ‘s’ చేరిస్తే ఇంగ్లీషులో plural noun అవుతుంది. అయితే కొన్నిసార్లు singular nounకు  ‘es’ చేర్చవలసి రావచ్చు, కొన్నిసార్లు singular noun యొక్క పూర్తి రూపం మారిపోవచ్చు. Singuar noun మరియు plural nounకు సంబంధించిన నియమాల (rules) ను మీరు ఇంకో పాఠంలో వివరంగా నేర్చుకోవచ్చు.

Possessive noun: ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తి లేదా ప్రదేశానికి చెంది ఉన్నదని తెలియచేసే వాటిని possessive noun అంటారు. మామూలుగా apostrophe ‘ పెట్టి ‘s’ చేర్చటంతో possessive nouns తయారవుతాయి.

Ex: Ram’s book, Gym’s rules, book’s cover, Sailu’s car etc.

పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే, Ram’s book అంటే రాము యొక్క పుస్తకం అంటే పుస్తకం రాముకు చెందినదని తెలుస్తోంది. అలాగే  Gym’s rules అంటే జిమ్ యొక్క రూల్స్,  book’s cover అంటే పుస్తకం యొక్క కవరు, Sailu’s car అంటే శైలు యొక్క కారు మొదలైనవి కూడా.

అయితే possessive nouns లో singular possessive nouns మరియు plural possessive nouns ఉన్నాయి. Singular possessive nounsకు  apostrophe ( ‘ ) పెట్టి ‘s’ చేరిస్తే సరిపోతుంది. Plural possessive nouns లో అప్పటికే ‘s’ ఉంటుంది కనుక ‘s’ని apostrophe ( ‘ ) తర్వాత చేర్చాలి.

Ex: juices’ flavors, eggs’ color, Americans’ philosophy, members’ votes etc.

పైన చెప్పబడిన  ఉదాహరణలను గమనిస్తే, juices’ flavorsలో ‘s’ తర్వాత apostrophe ( ‘ )  చేర్చబడటం గమనించవచ్చు.  ఇక్కడ చెప్పినవన్నీ కూడా plural possessive nouns కనుక అన్నింటికీ కూడా ఇదే విధానం వాడటం జరిగింది. Plural possessive nouns ఇలాగే ఏర్పడటం జరుగుతుంది.

Published by: Praveen Ragi, PR Learning Lab, WhatsApp: 0091 8978500864, Email: praveen2006@gmail.com,

Follow us on our WhatsApp group: https://chat.whatsapp.com/DqrACbkKCJ3EfPmteeOPnB 

Comments

Popular posts from this blog

Parts of Speech (భాషాభాగములు) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu

Adjective (విశేషణం) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu