Adverb (క్రియా విశేషణము) | English Grammar Lesson in Telugu | Learn English through Telugu
క్రియా విశేషణాన్ని ఇంగ్లీషులో adverb అంటారు. ఇది క్రియ యొక్క లక్షణాన్ని తెలియచేస్తుంది లేదా దాని గురించి వివరిస్తుంది అంటే పని లేదా చర్య యొక్క ప్రభావాన్ని తెలియచేస్తుంది. అంటే క్రియ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎంత తరుచుగా జరిగింది అనే విషయాలను adverb తెలియచేస్తుంది. ఇంకోరకంగా చెప్పాలంటే adverb క్రియను modify చేస్తుంది. Adverb లో ముఖ్యంగా ఐదు రకాలు ఉన్నాయి. అవి adverb of time, adverb of place, adverb of manner, adverb of degree and adverb of frequency.
Adverb
of time: Adverb of time అనేది ఎప్పుడైనా, ఏదైనా జరిగిందని లేదా జరుగుతుందని తెలియచేస్తుంది. అంటే ఈ adverb పని ఎప్పుడు జరిగింది లేదా జరగబోతోంది అనే విషయాన్ని తెలియచేస్తుంది. దీనిని వాక్యం యొక్క ప్రారంభంలో కానీ లేదా అంతంలో కానీ వాడటం జరుగుతుంది. సాధారణంగా చెప్పాలనుకున్న విషయాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడు లేదా క్రియ యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తున్నప్పుడు ఈ adverbను వాక్యం యొక్క ప్రారంభంలో వాడతారు.
Ex: soon, late, today, yesterday
etc.
Yesterday we were struck in the rain.
Ram met him yesterday.
పైన చెప్పిన ఉదాహరణలో మొదటిదాంట్లో adverb ను వాక్య ప్రారంభంలో వాడటం ద్వారా క్రియ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం జరిగింది. అదే adverb ను వాక్యం యొక్క చివరలో వాడినప్పుడు క్రియను మామూలుగానే తెలియచేయటం జరిగింది.
Adverb
of place: Adverb of place పని ఎక్కడ జరిగింది లేదా జరగబోతోంది అనే విషయాన్ని తెలియచేస్తుంది. సాధారణంగా దీనిని వాక్యం యొక్క చివరలో కానీ, క్రియ తర్వాత కానీ లేదా direct object తర్వాత కానీ వాడతారు.
Ex: here, there, below, outside etc.
They will come here.
She is talking outside.
పైన చెప్పిన ఉదాహరణలలో adverb అనేది verb తర్వాత రావటం గమనించవచ్చు.
Adverb
of manner: Adverb of manner అనేది క్రియ ఏ విధంగా జరిగిందో లేదా జరగబోతోందో తెలియచేస్తుంది. చాలా సాధారణంగా ఈ adverbs వాటి చివర ‘ly’ తో అంతమవుతాయి. కనుక వీటిని గుర్తించటం చాలా తేలిక. అంటే ‘ly’ తో అంతమైనవన్నీ adverb of manner అని అర్థం కాదు. వాటిని గుర్తించటానికి ఇది ఒక మార్గం మాత్రమే. కొన్ని – well, hard, fast వంటివి కూడా adverb of manner క్రిందకే వస్తాయి.
Ex: badly, slowly, happily, angrily
etc.
They are living happily.
She is driving slowly.
పైన ఇచ్చిన ఉదాహరణలలో రెండూ కూడా ‘ly’ తో అంతమవటం గమనించవచ్చు.
Adverb
of degree: Adverb of degree క్రియ ఎంత స్థాయి మేరకు లేదా ఎంతమటుకు జరిగిందో లేదా జరగబోతోందో తెలియచేస్తుంది.
Ex: almost, quite, much, nearly, so, too, very
etc.
She is quite fat for her age.
He nearly died in the road
accident.
పైన ఇచ్చిన ఉదాహరణలలో adverbs క్రియ యొక్క level ను తెలియచేస్తున్నాయి.
Adverb
of frequency: Adverb of
frequency అనేది ఎంత తరుచుగా క్రియ జరిగిందో లేదా జరగబోతోందో తెలియచేస్తుంది. క్రియ లేదా చర్య యొక్క తరచుదనాన్ని ఇవి తెలియచేస్తాయి కనుక వీటిని కూడా గుర్తించటం తేలికే.
Ex: daily, always, never, often,
occasionally, usually, weekly, frequently, twice, generally etc.
I drink milk daily.
He usually eats bananas in
the morning.
పైన ఇచ్చిన ఉదాహరణలు గమనిస్తే మొదటిదాంట్లో నేను ప్రతిరోజూ పాలు తాగుతాను అని చెప్పబడింది. అంటే drinking milk అనే action ఎంత తరచుగా జరుగుతుంది అంటే daily అని చెప్పవచ్చు. రెండవ ఉదాహరణలో అతడు సాధారణంగా పొద్దుటిపూట అరటిపండ్లు తింటాడు అని చెప్పటం జరిగింది. అంటే eating bananas అనే action ఎంత తరచుగా జరుగుతుంది అంటే usualగా అని చెప్పటం జరిగింది. ఇలాంటి వాటిని adverbs of frequency అని అంటారు.
Comments
Post a Comment